చందుర్తి(వేములవాడ): నట్టల నివారణ మందును మూగజీవాల యజమానులు సద్వినియోగం చేసుకోవాలని రుద్రంగి మార్కెట్ కమిటీ అధ్యక్షుడు ఏనుగుల శ్రీనివాస్ కోరారు. చందుర్తి మండలం లింగంపేట, కట్టలింగంపేటల్లో శుక్రవారం నట్టల నివారణ మందును శుక్రవారం పంపిణీ చేశారు. 1635 గొర్రెలకు, 690 మేకలకు నట్టల నివారణ మందును తాగించారు. పశువైద్యాధికారి నితిన్‌కుమార్, వైద్యసిబ్బంది బాలకృష్ణ పాల్గొన్నారు.
డీసీఎం వ్యాన్ బోల్తా
వేములవాడరూరల్: వేములవాడ మండలం ఫాజుల్‌నగర్ శివారులో కూల్‌డ్రింక్స్‌తో వెళ్తున్న డీసీఎం వ్యాన్ బోల్తాపడింది. వేములవాడ నుంచి కొండగట్టుకు కూల్‌డ్రింక్స్‌తో వెళ్తున్న డీసీఎం వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడింది. వ్యాన్ డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేవు.
Feb 25 2023 10:06 AM | Updated on Feb 26 2023 5:57 AM
Advertisement


