నామినేషన్ల తిరస్కరణపై ఆర్డీవోకు తాటిపర్తి ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

నామినేషన్ల తిరస్కరణపై ఆర్డీవోకు తాటిపర్తి ఫిర్యాదు

Nov 26 2026 1:35 AM | Updated on Nov 26 2026 1:35 AM

మార్కాపురం టౌన్‌: పుల్లలచెరువు మండలంలోని ఎండ్రపల్లి, నరజాముల తండా గ్రామాల్లో వైఎస్సార్‌ సీపీ తరఫున సర్పంచ్‌ అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను అధికారులు తిరస్కరించడంపై ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌.. ఆర్డీఓ శివరామిరెడ్డికి బుధవారం ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ మాట్లాడుతూ నామినేషన్ల తిరస్కరణ వెనుక అధికారుల ఏకపక్ష వ్యవహారశైలి, టీడీపీ నాయకుల ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గి వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల హక్కులను కాలరాయడం సరికాదని, నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్లను తిరస్కరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. స్పందించిన ఆర్డీవో నామినేషన్ల పరిశీలనలో అవకతవకలు జరిగినట్లు తేలితే సంబంధిత అధికారులను, గ్రామ ప్రజల సమక్షంలోనే నామినేషన్లను మరోసారి పరిశీలించి, నిబంధనల ప్రకారం అభ్యర్థుల విషయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట దోమకాల వెంకటేశ్వర్లు, ఎండ్రపల్లి, నరజాముల తండాకు చెందిన ప్రజలు, వైఎస్సార్‌ సీపీ నాయకులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement