వైఎస్సార్‌సీపీ నామినేషన్లపై ఏకపక్ష వేటు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నామినేషన్లపై ఏకపక్ష వేటు

Nov 26 2026 1:35 AM | Updated on Nov 26 2026 1:35 AM

వైఎస్సార్‌సీపీ నామినేషన్లపై ఏకపక్ష వేటు

పుల్లలచెరువు: పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో యండ్రపల్లి క్లస్టర్‌ రిటర్నింగ్‌ అధికారి అధికార పక్షానికి తొత్తుగా వ్యవహరించారని వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థి చిరదల అశోక్‌ ఆరోపించారు. యండ్రపల్లి పంచాయతీ సర్పంచ్‌ స్థానానికి వైఎస్సార్‌సీపీ తరఫున చిరదల అశోక్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కలిపి మొత్తం 7 నామినేషన్లు దాఖలు చేశారు. మంగళవారం జరిగిన పరిశీలనలో రిటర్నింగ్‌ అధికారి ఏకపక్షంగా వ్యవహరించి, వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌ అభ్యర్థుల నామినేషన్లన్నింటినీ తిరస్కరించారని అశోక్‌ మండిపడ్డారు. నిబంధనల ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు నోటీస్‌ బోర్డులో వివరాలు పొందుపరచాల్సి ఉండగా, విధులను అతిక్రమించి రాత్రి సమయంలో తిరస్కరణ బోర్డు పెట్టి వెళ్లిపోయారని ఆరోపించారు. ఉదయం నుంచి అడుగుతున్నా ఆర్వో సక్రమంగా సమాధానం చెప్పకుండా దాటవేశారని తెలిపారు. నామినేషన్లు తిరస్కరించిన విషయం తెలుసుకున్న వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున సచివాలయానికి చేరుకున్నారు. అక్కడ అన్ని దరఖాస్తులూ తిరస్కరణకు గురైనట్లు గుర్తించారు. దీనిపై అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆగ్రహించిన పార్టీ శ్రేణులు ప్రధాన రహదారిపై బైఠాయించి పెద్ద ఎత్తున నిరసనకు దిగాయి. సమాచారం అందుకున్న సీఐ అజయ్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆయన జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడి, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. అనంతరం జరిగిన అన్యాయాన్ని స్థానిక ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ దృష్టికి తీసుకెళ్లగా, బుధవారం మార్కాపురంలో ఆర్డీవోను కలిసి ఫిర్యాదు చేశారు.

పుల్లలచెరువు మండలం యండ్రపల్లిలో 7 సర్పంచ్‌ నామినేషన్ల తిరస్కరణ

మధ్యాహ్నం 3 గంటలకు బదులు రాత్రి వేళ నోటీస్‌ బోర్డులో పెట్టిన ఆర్వో

జాతీయ రహదారిపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు, మహిళల ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement