15న బాస్కెట్‌బాల్‌ జట్ల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

15న బాస్కెట్‌బాల్‌ జట్ల ఎంపిక

Nov 13 2026 8:21 AM | Updated on Nov 13 2026 8:21 AM

15న బాస్కెట్‌బాల్‌ జట్ల ఎంపిక పోలింగ్‌ సిబ్బందికి భద్రత కల్పించాలి యూబీఐ అత్యుత్తమ సేవలు హత్యాయత్నం కేసులో నిందితుడు అరెస్టు

కందుకూరు రూరల్‌: ఉమ్మడి ప్రకాశం జిల్లా సీనియర్‌ సీ్త్ర, పురుషుల బాస్కెట్‌బాల్‌ జట్ల ఎంపిక స్థానిక ఈ నెల 15న టీఆర్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నిర్వహించనున్నట్లు అసోసియేషన్‌ జిల్లా ప్రెసిడెంట్‌, చైర్మన్‌, సెక్రటరీలు వలేటి రవి, పాటిబండ్ల వెంకటేశ్వర్లు, తొట్టెంపూడి సుబ్బారావు తెలిపారు. ఎంపికలకు వయసు పరిమితి లేకుండా ఎవరైనా పాల్గొనవచ్చని తెలిపారు. నైపుణ్యం కలిగిన సీ్త్ర, పురుషులను ప్రకాశం జిల్లా జట్టుకు ఎంపిక చేసి ఈ నెలలోనే జరిగే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఛాంపియన్‌ షిప్‌లో పాల్గొంటారని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఎంపికల్లో పాల్గొనాలని తెలిపారు. పూర్తి వివరాలకు 9866126955, 9849429839 నంబర్లను సంప్రదించాలని కోరారు.

మార్కాపురం: ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు విధుల కేటాయింపులో ఎదురైన సమస్యలు, సౌకర్యాల కల్పనలో సమస్యలు పంచాయతీ ఎన్నికల్లో పునరావృతం కాకుండా చూడాలని ఎస్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె .ఎర్రయ్య జిల్లా అధ్యక్షుడు టీకేఎస్‌ ప్రసాద్‌ , జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌ దేశానాయక్‌ గురువారం డీఆర్‌ఓ శ్రీదేవీకి వినతిపత్రం అందచేశారు. గ్రామస్థాయిలో ఎన్నికలు జరుగుతున్నందున ఉపాధ్యాయులకు వారు పనిచేస్తున్న గ్రామం, సొంత గ్రామం, మినహాయించి పక్కన ఉన్న గ్రామపంచాయతీ, మండలాల్లో ఎన్నికల విధులు కేటాయించాలని కోరారు. 60 ఏళ్లు దాటిన ఉపాధ్యాయులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని, అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, 50% అంగవైకల్యం ఉన్న దివ్యాంగులకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. అలాగే మహిళలకు, గర్భిణులకు, చిన్న పిల్లలు ఉన్న ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని, పోలింగ్‌ విధుల్లో పాల్గొన్న పీఓ, ఏపీఓ, ఓపీఓ అధికారులకు జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీల్లో ఒకే రకమైన రెమ్యూనరేషన్‌ పంపిణీ విధానాన్ని అమలు చేయాలని కోరారు. మార్కాపురం జిల్లా ఉపాధ్యాయ వాణి కన్వీనర్‌ ఎస్‌ కే యూసఫ్‌ షరీఫ్‌, నాయకులు అక్కల నారాయణ, వెంకటరమణ, ఎన్‌ ప్రసాద్‌ రావు, ఏ అంజనీ కుమార్‌, హనుమంతరావు, ఎం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

● యూబీఐ మేనేజింగ్‌ డైరెక్టర్‌, ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆశీష్‌ పాండే

ఒంగోలు సబర్బన్‌:

బ్యాంకింగ్‌ రంగంలో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) అత్యుత్తమ సేవలు అందిస్తుందని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌, ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆశీష్‌ పాండే అన్నారు. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 108వ వ్యవస్థాపక దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. పాత గుంటూరు రోడ్డులోని ఏ–1 కన్వెన్షన్లో ప్రత్యేక వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశిష్‌ పాండే మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ బ్యాంకింగ్‌ లావాదేవీలను మరింత సులభతరం చేయడం, ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడం లక్ష్యంగా నూతన ఉత్పత్తులు, సేవలను ప్రారంభించిందన్నారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు నితేష్‌ రంజన్‌, రామసుబ్రహ్మణియన్‌ ఎస్‌, అమ్రేష్‌ ప్రసాద్‌, చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌ లలిత్‌ తనేజా, ఒంగోలు ప్రాంతీయ అధికారి వి.రవికుమార్‌, రీజనల్‌ అస్యూరెన్స్‌ హెడ్‌ కె.రామలింగేశ్వరరావు, ఉన్నతాధికారులు, బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

మార్కాపురం టౌన్‌:

హత్యయత్నం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..పట్టణంలోని కొండారెడ్డి కాలనీకి చెందిన ఎస్‌కె సుభానీ, జి. అనూషలు ప్రేమ వివాహం చేసుకున్నారు. అక్టోబర్‌ 31న సుభానీ అనూషపై హత్యాయత్నానికి ప్రయత్నించారు. దీంతో అనూష ఈనెల 7న పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేయగా పట్టణ ఎస్సై విశ్వనాధరెడ్డి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుడు సుభానిని గురువారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement