● రెండు లారీలు ఢీకొని డ్రైవర్ మృతి
దెందులూరు: స్థానిక దెందులూరు శివారులోని గుండేరు వాగు సమీపంలో 16వ జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న పుల్లల లారీని, అదే దిశలో వెనుక నుంచి వచ్చిన మరో పుల్లల లారీ అతివేగం, నిర్లక్ష్యంతో బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక వస్తున్న లారీ డ్రైవర్ ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కరవది గ్రామానికి చెందిన దేవరపల్లి వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న దెందులూరు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.


