సింగరాయకొండ: మండలంలోని జాతీయరహదారి ఎమర్జెన్సీ ల్యాండింగ్‌పై బుధవారం అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం విదితమే. ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరూ స్నేహితులే. మృతులది పొన్నలూరు మండలం శింగరబొట్లపాలెం గ్రామం. వీరిలో ఒకరు కూరపాటి చంద్రశేఖరరెడ్డి(35) బెంగళూరులో స్టాఫ్ట్‌వేర్ ఉద్యోగి కాగా, మరొకరు ఇమ్రాన్ తహీర్(27) ఓ సెల్‌ఫోన్ నెట్‌వర్క్ కంపెనీలో డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరు స్వగ్రామం నుంచి ఒంగోలు వెళ్లే క్రమంలో ముందు వెళ్తున్న కారును ఓవర్‌టేక్ చేస్తుండగా దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమాచారం తెలుసుకున్న ఎస్సై ఎల్ సుధీర్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. చంద్రశేఖర్‌రెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉండగా, ఇమ్రాన్ తహీర్‌కు వివాహం కాలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


