తుఫాన్ బీభత్సం నుంచి
నేటికీ తేరుకోని అన్నదాతలు
‘మురసు’ తుఫాన్ చేసిన గాయం నుంచి అన్నదాతలు నేటికీ కోలుకోలేకపోతున్నారు. తుఫాన్ తీరం దాటి పది రోజులు గడుస్తున్నా చేలల్లో పరిస్థితి ఏమాత్రం
కుదుటపడలేదు. అద్దంకి, కొరిశపాడు
మండలాల్లో ఈదురుగాలులు, ఎడతెరిపిలేని వర్షాలకు వేలాది ఎకరాల్లో పంటలు నిలువునా ధ్వంసమయ్యాయి. కళ్లముందే వరి, మొక్కజొన్న, మిర్చి, పసుపు,
కూరగాయల పంటలు నేలమట్టమై
కుళ్లిపోతుండటంతో రైతులు గుండెలు బాదుకుంటున్నారు. ఒకవైపు వరదనీరు నిలిచి పైర్లు పాచిపట్టిపోతుంటే, మరోవైపు సరైన విద్యుత్ సరఫరా లేక మరికొన్ని చేలు ఎండి నెర్రెలిస్తున్నాయి. ఆరుగాలం
శ్రమించిన పంట చేతికందక, అప్పుల ఊబిలో కూరుకుపోయామని, ప్రభుత్వం తక్షణమే ఎన్యూమరేషన్ చేపట్టి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతాంగం కన్నీటిపర్యంతమవుతోంది.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఒంగోలు


