ఓట్ల లెక్కింపు కేంద్రాలు పరిశీలించిన కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

ఓట్ల లెక్కింపు కేంద్రాలు పరిశీలించిన కలెక్టర్‌

Nov 8 2026 10:12 AM | Updated on Nov 8 2026 10:12 AM

ఒంగోలు సిటీ:

ఒంగోలులోని రైజ్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో శనివారం జరుగుతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియను కలెక్టర్‌ పి.రాజాబాబు స్వయంగా పరిశీలించారు. కౌంటింగ్‌ కేంద్రాన్ని, ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను జిల్లా అధికారులతో కలిసి ఆయన నిశితంగా తనిఖీ చేశారు. లెక్కింపు ప్రక్రియ ఎంత ఎలా సాగుతోంది, సిబ్బంది విధులు నిర్వహిస్తున్న తీరు, మీడియాకు సమాచారం చేరవేసే విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి సంబంధిత అధికారులకు పలు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రాజాబాబు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకతతో ఓట్ల లెక్కింపు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం మీడియా సెంటర్‌ను సందర్శించిన కలెక్టర్‌, పత్రికా, మీడియా ప్రతినిధులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని, రౌండ్ల వారీ ఫలితాలను వేగంగా, పక్కాగా అందించేలా ఏర్పాట్లు ఉండాలని పౌర సంబంధాల అధికారులను ఆదేశించారు. మీడియా సెంటర్‌లో అవసరమైన సాంకేతిక సదుపాయాలు నిరంతరం అందుబాటులో ఉండాలని చెప్పారు.

క్విస్‌ కళాశాలలో కౌంటింగ్‌ కేంద్రాల పరిశీలన

ఒంగోలు నగరంలోని క్విస్‌ కాలేజీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జిల్లా ఎన్నికల పరిశీలకుడు కేవీఎన్‌.చక్రధరబాబు, కలెక్టర్‌ పి.రాజాబాబు శనివారం తనిఖీ చేశారు. ఓట్లు లెక్కిస్తున్న విధానం, ఏజెంట్లను అనుమతిస్తున్న తీరు, ఈ కేంద్రంలో కల్పించిన భద్రత, తదితర అంశాలను పరిశీలించారు. తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియాకు తెలియజేయాలని చెప్పారు. ఈ మొత్తం ప్రక్రియ ఎన్నికల నిబంధనల మేరకు ఉండాలని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement