నైతిక విజయం మాదే.. | - | Sakshi
Sakshi News home page

నైతిక విజయం మాదే..

Nov 6 2026 2:08 AM | Updated on Nov 6 2026 2:08 AM

పోలీసుల కంటే రౌడీలే నయం : కుప్పం ప్రసాద్‌

ఒంగోలు టౌన్‌: ఒంగోలు కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోలీసులు, ప్రభుత్వ అధికారులు, అధికార పార్టీ కుట్రలను ఎదుర్కొన్న వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులే నైతిక విజయం సాధించారని, టీడీపీ అభ్యర్థి గెలుపు, మెజారిటీ అంతా పచ్చి బూటకమని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు స్పష్టం చేశారు. రెండున్నరేళ్ల కూటమి పాలనపై ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ఉండడంతో ఎన్నికలు సజావుగా జరిగితే చిత్తుగా ఓడిపోవడం ఖాయమని భయపడిన చంద్రబాబు అండ్‌ కో.. స్థానిక ఎన్నికలలో అక్రమాలు, అరాచకాలకు పాల్పడ్డారని, పోలీసులను ప్రయోగించి అధికారులపై ఒత్తిడి చేసి బలవంతంగా గెలుపు ప్రకటించుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఎన్నికల్లో అమెరికాలో ఉంటున్న వారి ఓట్లను కూడా ఇక్కడ పోల్‌ చేశారంటే.. ఎంత తీవ్రంగా దొంగ ఓట్లు వేసుకున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. స్థానిక వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో గురువారం పార్టీ మేయర్‌ అభ్యర్థి కుప్పం ప్రసాద్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో రవిబాబు మాట్లాడారు. పురపాలక ఎన్నికల ప్రారంభం నుంచి కూటమి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతూనే ఉందని విమర్శించారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, నామినేషన్లు చించివేయడం, ఫోర్జరీ సంతకాలతో విత్‌ డ్రా చేయడం, ఉపసంహరించుకోవాలంటూ పోలీసుల ద్వారా అభ్యర్థులను బెదిరింపులకు గురిచేయడం వంటి ఎన్నో ఘోరాలు చేశారని ఆరోపించారు. 2వ డివిజన్లో మొత్తం 3668 ఓట్లు ఉండగా 3086 ఓట్లు పోలయ్యాయని, 3,400కుపైగా ఓట్లను లెక్కించినట్లు చెబుతున్నారని వివరించారు. మొదట 85 శాతం ఓట్లు పోలైనట్లు ప్రకటించిన అధికారులు.. తెల్లవారేసరికి 94 శాతానికిపైగా ఓట్లు పోలైనట్లు ప్రకటించడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. మేయర్‌ అభ్యర్థికి 60.08 శాతం ఓట్లు పోలైనట్లు చెప్పిన అధికారులే ఇప్పుడు 71.24 శాతం ఓట్లు పోలైనట్లు చెబుతున్నారని, ఓట్ల శాతంలో అంత పెద్ద తేడా ఎందుకు వచ్చిందో అధికారులే చెప్పాలని నిలదీశారు. ఎన్నికల కౌంటింగ్‌లో కరెంటు పోయినప్పుడల్లా ఓట్ల కట్టలు మారాయని ఆరోపించారు. కేవలం ఓట్ల కట్టలు మార్చేందుకే తరచుగా విద్యుత్‌ సరఫరా నిలిపివేశారని అనుమానాలు వ్యక్తం చేశారు. పోలింగ్‌ కేంద్రంలో పోలీసులు వ్యవహరించిన తీరు దారుణంగా ఉందని తెలిపారు. దొంగ ఓటర్లు వచ్చినప్పుడు అభ్యంతరం వ్యక్తం చేస్తే.. ఒంగోలు తాలూకా సీఐ విజయకృష్ణ తమ అభ్యర్థుల గుండెలపై చేయి వేసి నెట్టారని తెలిపారు. 29వ డివిజన్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి కావటి రవి 129 ఓట్లతో గెలిస్తే.. ఓడిపోయినట్లు ప్రకటించాల్సిందిగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ పీఏ అధికారుల మీద ఒత్తిడి చేశాడని, రవి గట్టిగా పోరాడటంతో ఏమీ చేయలేక విజయం సాధించినట్లు డిక్లేర్‌ చేశారని వివరించారు. 60వ డివిజన్లో గాలం సుబ్బయ్య తరఫున ఏజంట్లు లేకుండా తాలూకా పోలీసులు తీసుకెళ్లారని, అయినప్పటికీ ఆయన గెలిస్తే ఓడినట్లు ప్రకటించారని ఆరోపించారు. 11వ డివిజన్లో ముందు గెలిచినట్లు ప్రకటించిన తమ అభ్యర్థిని తర్వాత ఓడినట్లు ప్రకటించి బీజేపీకి గిఫ్ట్‌గా ఇచ్చారని తెలిపారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి మేరికి కొప్పోలులో 430 ఓట్ల మెజారిటీ వస్తే 150 వచ్చినట్లు ప్రకటించారని చెప్పారు.

్తంచిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టేదిలేదని హెచ్చరించారు.

న్యాయపోరాటం చేస్తాం : నగరికంటి శ్రీనివాసరావు

స్థానిక సంస్థల ఎన్నికలు మొదలైనప్పటి నుంచే కూటమి ప్రభుత్వం అనేక అరాచకాలకు పాల్పడిందని వైఎస్సార్‌ సీపీ లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు తెలిపారు. రిటర్నింగ్‌ అధికారులు, పోలీసులు కలిసి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేశారని, ఎన్నికల ప్రచారం నిర్వహించుకునే పరిస్థితి లేకుండా మానసిక క్షోభకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలిచిన అభ్యర్థులకు 15 నిముషాల్లోపే డిక్లరేషన్‌ ఇవ్వాలని నిబంధనలు చెబుతున్నా.. రెండు రోజులవుతున్నా ఇంకా కొంతమందికి డిక్లరేషన్‌ ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దీని మీద న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పార్టీ నగర అధ్యక్షుడు కటారి శంకర్‌ మాట్లాడుతూ ఈ ఎన్నికలలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులంతా టీడీపీ, జనసేన మీద పోటీ చేసినట్లు లేదని, పోలీసులు, అధికారుల మీద పోటీచేసినట్లు ఉందని అన్నారు. న్యాయంగా ఓటింగ్‌ జరిగితే మరో 20 సీట్ల వరకు ఒంగోలులో తాము గెలిచేవారమన్నారు. 4వ డివిజన్‌ నుంచి గెలుపొందిన వైఎస్సార్‌ సీపీ కార్పొరేటర్‌ హజరత్‌ వలి (బాచి) మాట్లాడుతూ తాలూకా సీఐ విజయకృష్ణ ప్రవర్తన ఒక పోలీసు అధికారిలా లేదని, అభ్యర్థులను నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, అతనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 29వ డివిజన్‌ నుంచి గెలుపొందిన కావటి రవి మాట్లాడుతూ తాను గెలిచినప్పుటికీ ఓడిపోయినట్లు ప్రకటించడానికి ప్రయత్నాలు జరిగాయని, తనకు డిక్లరేషన్‌ ఇవ్వకుంటే కదలనని భీష్మించుకుని కూర్చున్నానని తెలిపారు. ఇలాంటి ఎన్నికలను గతంలో ఎప్పుడూ చూడలేదని, కూటమి అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఎన్నో కుట్రలకు పాల్పడ్డారని ఆరోపించారు. 1వ డివిజన్‌ నుంచి పోటీ చేసి గెలిచిన రాణి ప్రియాంక మాట్లాడుతూ తన మీద ఎంతో నమ్మకంతో ఓట్లేసి గెలిపించిన త్రోవగుంట ప్రజలకు రుణపడి ఉంటానని చెప్పారు.

టీడీపీ విజయం, మెజారిటీ అంతా బూటకం

అమెరికాలో ఉన్న వారి ఓట్లు కూడా

టీడీపీ వారే వేసుకున్నారు

కరెంటు తీసేసి ఓట్ల కట్టలు మార్చివేశారు

గెలిచిన వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను సైతం ఓడిపోయినట్లు ప్రకటించారు

బ్యాలెట్‌ పేపర్లపై స్వస్తిక్‌ గుర్తు లేకుండానే లెక్కించుకున్నారు

రౌడీలకంటే దారుణంగా పోలీసులు

వ్యవహరించారు

ఒంగోలు తాలూకా సీఐ అరేయ్‌ ఒరేయ్‌

అంటూ పిలవడం సిగ్గుచేటు

వైఎస్సార్‌ సీపీ మేయర్‌ అభ్యర్థికి,

కార్పొరేటర్‌ అభ్యర్థులకు ఓట్లేసిన ఒంగోలు ప్రజలకు ధన్యవాదాలు

విలేకరుల సమావేశంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు, మేయర్‌ అభ్యర్ధి కుప్పం ప్రసాద్‌

కార్పొరేషన్‌ ఎన్నికలలో పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత ఘోరంగా ఉందని, పోలీసుల కంటే రౌడీలే నయమన్నట్లు ప్రవర్తించారని వైఎస్సార్‌ సీపీ మేయర్‌ అభ్యర్థి కుప్పం ప్రసాద్‌ తీవ్రంగా విమర్శించారు. మేయర్‌ అభ్యర్థినైన తన రెక్క పట్టుకుని పోలింగ్‌ రోజు ఏఎస్పీ బయటకు నెట్టడం ప్రజలంతా చూశారని, కౌంటింగ్‌ కేంద్రంలో తాలూకా సీఐ విజయకృష్ణ తానొక పోలీసు అధికారినన్న సంగతి కూడా మరిచిపోయి దుర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఎన్నికలలో నైతిక విజయం తమదేనని స్పష్టం చేశారు. కౌంటింగ్‌ ప్రారంభించిన తర్వాత తొలి రౌండులో వైఎస్సార్‌ సీపీకి మెజారిటీ వచ్చిందని అప్పటికప్పుడు అఽధికారులను మార్చి వేసి గందరగోళం సృష్టించారని వివరించారు. రాత్రి 10.30కు తొలి రౌండ్‌ ప్రకటించారని, ఆ తరువాత ఉదయం 6 గంటల వరకు ఎలాంటి ప్రకటన చేయలేదని తెలిపారు. తమకు 19 మందిని మాత్రమే కౌంటింగ్‌ ఏజంట్లను ఇచ్చారని, 36 టేబుళ్లపై కౌంటింగ్‌ నిర్వహించారని, అదెలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే జవాబు లేదని తెలిపారు. తన తరఫున చీఫ్‌ కౌంటింగ్‌ ఏజంట్లను కూడా లోపలకు అనుమతించని అధికారులు.. టీడీపీ ఎమ్మెల్యే పీఏలను, అభ్యర్థి తండ్రిని, టీడీపీ నాయకులను ఎలా అనుమతించారో చెప్పాలని ప్రశ్నించారు. ఎమ్మెల్యే పీఏలు రాత్రంతా కౌంటింగ్‌ హాలులోనే గడిపారని, దీనికి అధికారులు బాధ్యత వహించాలని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌కు వచ్చిన మెజారీటీ కంటే తగ్గకూడదని బహిరంగంగా టీడీపీ నాయకులు మాట్లాడుకోవడం వినిపించిందన్నారు. మెజారిటీ కోసం ప్రజాస్వామ్యాన్ని కాలరాసిన ఎమ్మెల్యే జనార్దన్‌ తన జీవితంలో ఒంగోలు నుంచి గెలవలేడని తేల్చి చెప్పారు. 2029లో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, ఇప్పుడు అన్యాయంగా ప్రవరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement