కొణిజేడులో రిగ్గింగ్‌ | - | Sakshi
Sakshi News home page

కొణిజేడులో రిగ్గింగ్‌

Nov 6 2026 2:08 AM | Updated on Nov 6 2026 2:08 AM

టంగుటూరు: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌లో టంగుటూరు మండలంలోని కొణిజేడు గ్రామంలో అధికార పార్టీ అరాచకాలకు పాల్పడింది. అడ్డూఅదుపూ లేకుండా ఉదయం నుంచే టీడీపీ శ్రేణులు, బయట నుంచి తీసుకొచ్చిన 100 బౌన్సర్లతో యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. వారంతా కలిసి వైఎస్సార్‌ సీపీ ఓటర్లు పోలింగ్‌ బూత్‌ల వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అదేంటని ప్రశ్నించిన ఓటర్లపై దౌర్జన్యం చేస్తూ దాడులకు తెగబడ్డారు. దీంతో చేసేదేమీ లేక వైఎస్సార్‌ సీపీ ఓటర్లు, మహిళలు, యువకులు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసినప్పటికీ.. సీఐ షమీముల్లా టీడీపీకి వత్తాసు పలికి వైఎస్సార్‌ సీపీ ఓటర్లు ఓట్లు వేయకుండా ఆటంకం కలిగించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి ఆదిమూలపు సురేష్‌ హుటాహుటిన కొణిజేడు గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో జరుగుతున్న అరాచకాలపై అధికారులకు ఫోన్లు చేసి పరిస్థితిని వివరించారు. టీడీపీ అరాచకాల గురించి మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. గ్రామంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మధ్యాహ్నం రెండు గంటల వరకు వైఎస్సార్‌ సీపీ ఓటర్లు ఓట్లు వేసేందుకు ఎంతగా ప్రయత్నించినా.. టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో పాటు పోలీసులు కూడా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించడంతో చేసేదేమీ లేక ఎన్నికలను బహిష్కరించినట్టు వైఎస్సార్‌ సీపీ ఓటర్లు ప్రకటించి వెనుదిరిగి వెళ్లిపోయారు. ఆపై టీడీపీ బూత్‌ ఏజెంట్లు, నాయకులు యథేచ్ఛగా రిగ్గింగ్‌ చేసుకున్నారు.

రాష్ట్రంలో అరాచక పాలన : ఆదిమూలపు సురేష్‌

వైఎస్సార్‌ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని ఆరోపించారు. సక్రమంగా ఓటింగ్‌ జరిగితే తాము ఓడిపోతామనే భయంతో టీడీపీ నాయకులు, కూటమి ప్రభుత్వం రిగ్గింగ్లకు పాల్పడుతూ ఓటర్లను స్వేచ్ఛగా ఓటు వేసేందుకు వీల్లేకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎల్లకాలం అధికారం ఉండదని, రేపు అంటూ ఒకరోజు వస్తుందని, ఆ రోజు మీరు చేసిన పాపాలకు వడ్డీతో సహా అనుభవించాల్సి వస్తుందని అన్నారు. అలాగే మర్లపాడు గ్రామంలో 18/10 పోలింగ్‌ బూత్‌లో తలుపులు మూసి మరీ 20 దొంగ ఓట్లు వేయడాన్ని గమనించిన వైఎస్సార్‌ సీపీ ఓటర్లు వారిని అడ్డుకునే సమయంలో కొంత వాగ్వాదం జరిగింది. టీడీపీ ఏజెంట్లు ఉదయం నుంచి మద్యం తాగి పోలింగ్‌ కేంద్రంలో నానాయాగి చేశారు.

మీ ఓట్లు మేము వేసుకున్నామంటున్నారు

మీ ఓట్లు మేము వేసుకున్నాం.. మీరు ఇంటికిపోండి అని టీడీపీ ఏజెంట్లు మా ఓటర్ల స్లిప్పులు తీసుకుని చించివేశారు. మమ్మల్ని బయటకు పంపించారు. మా ఓట్లు మీరేయడం ఏంటని పోలింగ్‌ అధికారులు, పోలీస్‌ అధికారులను అడిగినా ఫలితం లేదు. బయట నుంచి తీసుకొచ్చిన కిరాయి రౌడీలను పెట్టి గ్రామంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి పోలింగ్‌ కేంద్రం వద్దకు వెళ్లకుండా చేస్తున్నారు. – నాగండ్ల ఉమా, తాటిపర్తి సుశీల,

కొణిజేడు గ్రామ ఓటర్లు

ఓటమి భయంతోనే బెదిరింపులు

కొణిజేడు గ్రామంలో ఇప్పటికి నాలుగు ఎలక్షన్లు జరగ్గా.. మూడుసార్లు వైఎస్సార్‌ సీపీ, ఒకసారి టీడీపీ ఎంపీటీసీ గెలుపొందారు. మూడు సార్లు వైఎస్సార్‌ సీపీ సర్పంచి, ఒకసారి టీడీపీ సర్పంచ్‌ గెలుపొందారు. కొణిజేడు గ్రామం పూర్తిగా వైఎస్సార్‌ సీపీ కంచుకోట. అందుకే టీడీపీ వారు ఓటమి భయంతో కిరాయి గూండాలను పెట్టి కేవలం వైఎస్సార్‌ సీపీ ఓటర్లను అడ్డుకుని రిగ్గింగ్‌ చేసుకున్నారు.

– వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీ అభ్యర్థి బుర్ర అనూష, కొణిజేడు

పరిషత్‌ పోరులో అధికార పార్టీ అరాచకం

వైఎస్సార్‌ సీపీ ఓటర్లను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు, 100 మంది బౌన్సర్లు

అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్సార్‌ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి ఆదిమూలపు సురేష్‌

అయినప్పటికీ ఓట్లు వేయలేకపోయిన

వైఎస్సార్‌ సీపీ ఓటర్లు

ఎన్నికలను బాయ్‌కాట్‌ చేసినట్లు

ప్రకటించిన వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement