రెండు కాలేజీల్లో స్ట్రాంగ్‌ రూములు | - | Sakshi
Sakshi News home page

రెండు కాలేజీల్లో స్ట్రాంగ్‌ రూములు

Nov 6 2026 2:08 AM | Updated on Nov 6 2026 2:08 AM

ఒంగోలు సబర్బన్‌: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి బ్యాలెట్‌ బాక్సులు భద్రపరిచేందుకు ఒంగోలు సమీపంలోని రెండు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూములు, రిసెప్షన్‌ కౌంటర్లను కలెక్టర్‌ పి.రాజాబాబు గురువారం ఎస్పీ హర్షవర్దన్‌రాజుతో కలిసి పరిశీలించారు. స్థానిక క్విస్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ, రైజ్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలను సందర్శించి రిసెప్షన్‌ సెంటర్లు, స్ట్రాంగ్‌ రూముల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ క్విస్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో దర్శి, అద్దంకి, ఒంగోలు నియోజకవర్గాలకు సంబంధించిన 12 మండలాలు, రైజ్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో కొండపి, కందుకూరు, ఎస్‌ఎన్‌ పాడు నియోజకవర్గాలకు సంబంధించి 12 మండలాల బ్యాలెట్‌ బాక్సులను భద్రపరచనున్నట్లు తెలిపారు. బ్యాలెట్‌ బాక్స్‌లకు ఎలాంటి డ్యామేజీ జరగకుండా ఆయా స్ట్రాంగ్‌ రూములలో చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. సక్రమంగా బందోబస్తు నిర్వహించాలని సూచించారు. ట్రాఫిక్‌ సమస్యలు రాకుండా క్రమ పద్ధతిలో బస్సులు గమ్యస్థానం చేరే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఎస్పీ సూచించారు. స్ట్రాంగ్‌ రూముల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని చెప్పారు. కలెక్టర్‌ వెంట జాయింట్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి, కందుకూరు సబ్‌ కలెక్టర్‌ హిమ వంశీ, జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి చిరంజీవి, జిల్లా నోడల్‌ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

పోలింగ్‌ సరళి లైవ్‌లో వీక్షణ...

ప్రకాశం జిల్లావ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్‌ ప్రక్రియను ప్రకాశం భవనం నుంచి జిల్లా ఎన్నికల పరిశీలకుడు కె.వి.ఎన్‌.చక్రధర బాబు, కలెక్టర్‌ పి.రాజాబాబు, జాయింట్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి లైవ్‌ వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్ల క్యూ లైన్లు, భద్రతా ఏర్పాట్లు, పోలింగ్‌ సిబ్బంది పనితీరును వారు పరిశీలించారు. జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. కంట్రోల్‌ రూమ్‌లో విధుల్లో ఉన్న సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి సమస్య తలెత్తినా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్‌ చెప్పారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ బ్యాలెట్‌ బాక్సులు చేర్చిన సిబ్బంది

పరిశీలించిన కలెక్టర్‌ రాజాబాబు, ఎస్పీ హర్షవర్దన్‌రాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement