పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ పంకజ్‌ కుమార్‌ మీనా | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ పంకజ్‌ కుమార్‌ మీనా

Nov 6 2026 2:08 AM | Updated on Nov 6 2026 2:08 AM

పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ పంకజ్‌ కుమార్‌ మీనా డిగ్రీ పరీక్ష వాయిదా ఎన్నికల విధుల్లో పాల్గొన్న టీచర్లకు నేడు ఓడీ ఇవ్వాలి ఏడుగురి జీవితాల్లో వెలుగులు

మార్కాపురం టౌన్‌: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా ఎస్పీ పంకజ్‌ కుమార్‌ మీనా మార్కాపురం, కొనకనమిట్ల మండలాల్లోని పలు పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూ లైన్ల నిర్వహణ, ఓటర్ల సౌకర్యాలను పరిశీలించారు. 100 మీటర్ల పరిధిలో భద్రతా ఏర్పాట్లు, బారికేడింగ్‌, అనధికార వ్యక్తుల ప్రవేశ నియంత్రణను తనిఖీ చేశారు. డ్యూటీ లో ఉన్న పోలీస్‌ సిబ్బంది కి ఎన్నికల సంఘం నిబంధనలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి తప్పనిసరిగా పాటిస్తూ అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.

● స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 7 నుంచి 15కు మార్పు

ఒంగోలు సిటీ: ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ (యూజీ) మూడు, ఐదో సెమిస్టర్‌ పరీక్షల్లో మార్పు చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 7న జరగాల్సిన మొదటి రోజు పరీక్షను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసినట్లు విశ్వవిద్యాలయ ఏసీఈ ప్రొఫెసర్‌ ఎ.భారతీదేవి తెలిపారు. వైస్‌ చాన్సిలర్‌ ప్రొఫెసర్‌ డి.వి.ఆర్‌.మూర్తి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. నవంబర్‌ 7 నుంచి 16వ తేదీ వరకు జరగాల్సిన పరీక్షల్లో మొదటి రోజు పరీక్ష తేదీని మాత్రమే మార్చినట్లు స్పష్టం చేశారు. మిగిలిన పరీక్షలన్నీ గతంలో ప్రకటించిన టైంటేబుల్‌ ప్రకారం యథావిధిగా జరుగుతాయని వెల్లడించారు. విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు ఈ మార్పును గమనించాలని ఆమె కోరారు.

ఒంగోలు సిటీ: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులందరికీ ఈ నెల 6వ తేదీన ఓడీ (ఆన్‌ డ్యూటీ) సౌకర్యం కల్పించాలని యూటీఎఫ్‌ ప్రకాశం జిల్లా శాఖ కోరింది. ఈ మేరకు గురువారం జిల్లా రెవెన్యూ అధికారి పి.వెంకటరమణను కలిసి వినతిపత్రం అందజేసింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఎన్నికల విధులకు హాజరైన ఉపాధ్యాయులు పోలింగ్‌ అనంతరం ఎన్నికల సామగ్రిని ఒంగోలులోని నిర్దేశిత కేంద్రాల్లో అప్పగించాల్సి ఉంటుందని యూటీఎఫ్‌ ప్రతినిధులు వివరించారు. బ్యాలెట్‌ బాక్సులు, బ్యాలెట్‌ పత్రాలు, పీఓ డైరీ, మార్క్‌డ్‌ కాపీ, సీల్స్‌, వివిధ రకాల కవర్లు, వినియోగించని ఎన్నికల సామగ్రి తదితరాలను జాగ్రత్తగా అప్పగించిన అనంతరం తిరిగి తమ ప్రాంతాలకు చేరుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ప్రక్రియలో సమయం పడుతున్నందున ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులందరికీ నవంబర్‌ 6న ఓడీ సౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్‌ అబ్దుల్‌ హై, జిల్లా కోశాధికారి చిన్నస్వామి తదితరులు పాల్గొన్నారు.

● గ్రీన్‌ చానల్‌తో గుండె చైన్నైకి తరలింపు

మన్సూరాబాద్‌: ఏడుగురి జీవితాల్లో వెలుగులు నింపాడు ఓ భవన నిర్మాణ మేసీ్త్ర. జీవన్‌ధాన్‌ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌ ప్రకాశం జిల్లా పోకూరుకు చెందిన గుంజల సురేంద్ర (37) నగరంలోని ఎల్‌బీనగర్‌లో నివసిస్తూ భవన నిర్మాణ మేసీ్త్రగా పనులు నిర్వహిస్తున్నాడు. గత నెల 27 తీవ్ర తలనొప్పితో ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. కుటుంబసభ్యులు వెంటనే సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స అందించిన వైద్యులు ఈ నెల 4న బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు ప్రకటించారు. విషయం తెలుసుకున్న జీవన్‌ధాన్‌ ప్రతినిధులు అవయవదానంపై సురేంద్ర భార్య గిరిషకు అవగహన కల్పించారు. గీరిష అవయవదానంపై అంగీకారించడంతో సురేంద్ర నుంచి రెండు కిడ్నీలు, లివర్‌, గుండె, ఉపిరితిత్తులు, రెండు కార్నియాలను ఏడు అవయవాలను జీవన్‌ధాన్‌ను దానం చేసింది.

గ్రీన్‌ చానల్‌ ఏర్పాటుతో గుండె చైన్నెకు తరలింపు

ఎల్‌బీనగర్‌ పోలీసులు గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేయడంతో గుండెను ప్రత్యేక చార్డర్‌ ఫ్లైట్‌లో చైన్నెకు తరలించారు. గురువారం మధ్యాహ్నం ఎల్‌బీనగర్‌ కామినేని హాస్పిటల్‌కు నుంచి గుండెను తరలించి చైన్నెలోని ఎంజీఎం హాస్పిటల్‌కు 3.50 నిమిషాల్లోగా గుండెను చేర్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement