ఉమ్మడి జిల్లాలో జోరుగా ప్రచారం 40 జెడ్పీటీసీ స్థానాలకు 159 మంది 277 ఎంపీటీసీ స్థానాలకు 737 మంది పోటీ 5వ తేదీన పోలింగ్‌కు సర్వం సిద్ధం 7వ తేదీ ఓట్ల లెక్కింపుతో తేలనున్న ఎన్నికల ఫలితాలు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రాదేశిక పోరులో ప్రచార పర్వం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు వారం రోజుల పాటు ముమ్మరంగా ప్రచారం చేశారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తమను ఆదరించాలంటూ పెద్ద ఎత్తున ఇంటింటి ప్రచారం చేశారు. అటు అధికార టీడీపీ నుంచి బరిలో ఉన్న అభ్యర్థులతో పాటు, ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ సీపీ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు, స్వతంత్ర, వామపక్ష, ఇతర పార్టీల నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు తమ విజయం కోసం ముమ్మరంగా శ్రమించారు. ఈ నేపథ్యంలో ఈనెల 5వ తేదీ జరగనున్న ఎన్నికల్లో తమ భవిష్యత్‌ను పరీక్షించుకోనున్నారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో 48 జిల్లా పరిషత్ ప్రాదేశిక స్థానాలు ఉండగా, ఎన్నికల ముందే 8 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 40 స్థానాల్లో టీడీపీ, వైఎస్సార్ సీపీతో పాటు వివిధ పార్టీల నుంచి 159 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. అలాగే మొత్తం 645 ఎంపీటీపీ ప్రాదేశికాలకు గాను ఇప్పటికే 368 ప్రాదేశికాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 277 ఎంపీటీసీ స్థానాలకు 737 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రాదేశిక పోటీలో ఉన్న అభ్యర్థులంతా ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా చేశారు. అభ్యర్థులతో పాటు ప్రధాన రాజకీయ పార్టీలకు


