అడ్డదారిలో అందలం | - | Sakshi
Sakshi News home page

అడ్డదారిలో అందలం

Nov 4 2026 2:08 AM | Updated on Nov 4 2026 2:08 AM

అడ్డదారిలో అందలం „ మిగతా 8లో..

మున్సిపల్‌ ఎన్నికల్లో పతాక స్థాయికి కూటమి దాష్టీకం టీడీపీ నేతల చెప్పుచేతల్లోనే పోలీసులు, అధికారులు నామినేషన్ల నుంచి కౌంటింగ్‌ దాకా అడుగడుగునా అధికార దుర్వినియోగం పోలీసులే పచ్చచొక్కాలేసుకుని అధికార పార్టీకి ఊడిగం అడ్డదారిలో వచ్చిన విజయంతో కూటమి సంబరాలు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పురపోరులో ఎలాగైనా విజయాన్ని చేజిక్కించుకోవాలని కూటమి నేతలు అధికారులు, పోలీసులను పావులుగా చేసుకుని అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. నామినేషన్ల దశలోనే టీడీపీ అభ్యర్థులకు పోటీ లేకుండా చేసేందుకు పోలీసులే కంకణం కట్టుకుని మరీ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులపై లాఠీలతో విరుచుకుపడ్డారు. పోలీసుల సమక్షంలోనే పచ్చ గూండాలు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయనీయకుండా పత్రాలు చించేశారు. కొన్నిచోట్ల వారందరినీ దాటుకుని ఆర్వోల దగ్గరకు వెళ్లినా వారి నామినేషన్‌ పత్రాలు తీసుకోకుండా కాలయాపన చేసి సమయం దాటిపోయిందంటూ వెనక్కుపంపారు. పరిశీలన దశలో అధికారులను ముందుపెట్టి తిరస్కరణల నాటకం రక్తికట్టించారు. కుంటిసాకులు చెబుతూ చిన్నచిన్న కారణాలతోనే నామినేషన్లను తిరస్కరించారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులపై, వారి కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు పెట్టి పోలీస్‌స్టేషన్లకు పిలిపించి భయపెట్టి కొందరిచేత బలవంతంగా నామినేషన్లు విత్‌డ్రా చేయించారు. ఇలా దర్శి, కనిగిరి మున్సిపాలిటీలను, ఒంగోలు, మార్కాపురం, చీమకుర్తి, అద్దంకి, గిద్దలూరు మున్సిపాలిటీల్లో కొన్ని వార్డులను బలప్రయోగంతో ఏకగ్రీవం చేసుకున్నారు. చివరకు అన్ని దాష్టీకాలను దాటుకుని బరిలో నిలిచిన అభ్యర్థులను కనీసం ప్రచారం చేసుకోనీయకుండా మళ్లీ పోలీసులతో వారిపై ఒత్తిడి చేయించారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు డబ్బు, మద్యం పారించారు. ఓటర్లు సజావుగా పోలింగ్‌ బూత్‌లకు వచ్చి ఓటేస్తే ఎక్కడ తాము ఓడిపోతామేమోనన్న భయంతో వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లను పోలీసులతో బెదిరించి, పోలీస్‌స్టేషన్లలో నిర్బంధించారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను తుంగలో తొక్కుతూ సమస్యాత్మక కేంద్రాల్లో సైతం సీసీ కెమెరాలు లేకుండా చేశారు. పోలింగ్‌ రోజు పోలింగ్‌ కేంద్రాల వద్ద భయోత్పాతాన్ని సృష్టించి.. ఓటర్లను బూత్‌ల దాకా రానీయకుండా టీడీపీ నాయకులే ఎక్కడికక్కడ రిగ్గింగ్‌ చేసుకున్నారు. ఇలా ప్రజాస్వామ్యానికి

వక్కలగడ్డ మల్లికార్జున, మార్కాపురం

కాకాని అశోక్‌, అద్దంకి

జేవీ నారాయణ, గిద్దలూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement