కొండముడుసుపాలెంలో కుల బహిష్కరణ | - | Sakshi
Sakshi News home page

కొండముడుసుపాలెంలో కుల బహిష్కరణ

Oct 30 2026 7:42 AM | Updated on Oct 30 2026 7:42 AM

కొండముడుసుపాలెంలో కుల బహిష్కరణ

కందుకూరు రూరల్‌:

రామాలయానికి చందాలు ఇవ్వలేదన్న నెపంతో గ్రామంలో 10 కుటుంబాలను కుల పెద్దలు బహిష్కరించారు. ఈ సంఘటన కొండముడుసుపాలెం గ్రామంలోని వడ్డెపాలెంలో జరిగింది. బాధితుల వివరాల ప్రకారం..వడ్డెపాలెంలో సుమారు 200 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వడ్డెపాలెంలో ఏడాది క్రితం రామాలయం నిర్మించారు. ఆ సమయంలో కుటుంబానికి రూ.10 వేల చందా చెల్లించాలని కుల పెద్దలు నిర్ణయించి వసూలు చేశారు. అయితే ఆ నగదు సరిపోకపోవడంతో ఈ ఏడాది మళ్లీ రూ.4,500 చెల్లించాలని చెప్పారు. అయితే కూలినాలీ చేసుకునే వారు, చర్చికి వెళ్లే కొంత మంది చందాలు ఇవ్వలేమని చెప్పారు. దీనిపై కుల పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చందాలు ఇవ్వని 10 కుటుంబాల వారిని కుల బహిష్కరణ చేస్తున్నట్లు ప్రకటించారు. కుల బహిష్కరణ చేసిన వారితో మాట్లాడి, వారిని శుభకార్యాలు, అశుభకార్యాలకు ఆహ్వానించినా వారికి రూ.1000 చొప్పున జరిమానా విధిస్తామని చెప్పారు. దీంతో రెండు కుటుంబాల వారు వెంటనే ఆ మొత్తాన్ని చెల్లించారు.

వడ్డెపాలెంలో పది కుటుంబాలను బహిష్కరించిన కుల పెద్దలు

రామాలయానికి చందాలు

ఇవ్వలేదన్న నెపంతో

ఆ కుటుంబాలతో మాట్లాడితే

రూ.1000 జరిమానా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement