విశ్వసనీయతకు, వెన్నుపోటుకు మధ్యే ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

విశ్వసనీయతకు, వెన్నుపోటుకు మధ్యే ఎన్నికలు

Oct 30 2026 7:42 AM | Updated on Oct 30 2026 7:42 AM

చీమకుర్తి రూరల్‌: వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుపరిపాలన అందించారని జిల్లా పరిషత్‌ మాజీ చైర్‌పర్సన్‌, వైఎస్సార్‌ సీపీ సీఈసీ మెంబర్‌ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా బుధవారం రాత్రి అగ్రహారం గ్రామంలో ఎంపీటీసీ అభ్యర్థి వేమ ఝాన్సీ రాణితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా ఆ గ్రామంలో గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ అభివృద్ధి అంటే ఏంటో మాటలతో కాకుండా చేతలతో చేసి చూపించింది వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వమన్నారు. జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్‌ కాలేజీని తీసుకువచ్చిన ఘనత వైఎస్సార్‌ సీపీ దక్కుతుందన్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల పేర్లు మార్చడం తప్ప ఈ రెండున్నరేళ్లలో కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేని అసమర్థ ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేందుకు కుయుక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తేనే అధికార వెన్నుపోటు పార్టీకి బుద్ధి వస్తుందన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షుడు శేషురెడ్డి, మాజీ ఎంపీటీసీ విజయలక్ష్మి, మాజీ జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, నల్లూరి చంద్ర, ప్రసాద్‌ రెడ్డి, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను ఆశీర్వదించండి

అగ్రహారం ఎన్నికల ప్రచారంలో జిల్లా పరిషత్‌ మాజీ చైర్‌పర్సన్‌, వైఎస్సార్‌సీపీ సీఈసీ మెంబర్‌ బూచేపల్లి వెంకాయమ్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement