● ఏపీసీపీడీసీఎల్ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు
ఒంగోలు సబర్బన్: అర్నాబ్ తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం జిల్లాలకు ప్రకాశం జిల్లా నుంచి విద్యుత్ సిబ్బందిని, వాహనాలను పంపించారు. ఈ సందర్భంగా ఏపీసీపీడీసీఎల్ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు గురువారం జెండా ఊపి వాహనాలను, సిబ్బందిని పంపించారు. అర్నాబ్ తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న విద్యుత్ లైన్లను, నేలకొరిగిన విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించేందుకు ప్రకాశం సర్కిల్ నుంచి పది బృందాలకు చెందిన 100 మంది కార్మికులను, వాహనాలను కూడా పంపామన్నారు. అవసరాన్ని బట్టి విద్యుత్ పరికరాలతో సహా వాహనాల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి పంపించామన్నారు. దెబ్బతిన్న విద్యుత్ లైన్లు, స్తంభాలను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించి, విద్యుత్ సరఫరాను వీలైనంత త్వరగా సాధారణ స్థితికి తీసుకురావడానికి ఈ బృందాలు కృషి చేయనున్నాయి.


