మార్కాపురం: స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు జిమ్నాస్టిక్స్‌లో సత్తా చాటారు. ఈ నెల 27న మార్కాపురంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయి జిమ్నాస్టిక్స్ పోటీల్లో అండర్–14, అండర్–17, అండర్–19 విభాగాల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వచ్చే నెలలో కర్నూలు డీఎస్ఏ స్టేడియంలో జరగనున్న రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్స్ పోటీల్లో వీరు పాల్గొననున్నట్లు హెచ్ఎం ఎం చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. అండర్–19 విభాగంలో ఎస్కే బాజీ, జి.గణేష్; అండర్–17 విభాగంలో డి. గౌతమ్, జి. రంజిత్, ఎం. అయ్యప్ప, డి. శ్రీనివాసులు; అండర్–14 విభాగంలో జి. గణేష్, టి. యెహోషువ, డి. ముస్తాన్, ఎల్. ప్రేమ్‌కుమార్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడంపై పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం ఎస్. సైమన్, రవిశేఖర్, పాఠశాల సిబ్బంది ఓ. వీరారెడ్డి, రమేష్, శివ, పట్టణ ఎస్సై విశ్వనాథరెడ్డి, సిబ్బంధి అభినందించారు. విద్యార్థులకు శిక్షణనిచ్చిన పీడీలు డోలా శ్యామలాదేవి, పి. దామోదర్‌రెడ్డి, ఓ. ఒబులేసు కృషిని ప్రశంసించారు. విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయాలు సాధించి పాఠశాలకు, మార్కాపురం ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థుల విజయాల వెనుక ఉపాధ్యాయులు, పీడీల కృషి అభినందనీయమని తెలిపారు.


