సాక్షి టాస్క్‌ఫోర్స్: ఎంపీటీసీ ఎన్నికల్లో అభ్యర్థుల రిజర్వేషన్లను జిల్లా ఎన్నికల అధికారి ఖరారు చేశారు. అందులో కురిచేడు, కురిచేడు దక్షిణం అన్‌రిజర్వుడు మహిళ, కురిచేడు ఉత్తరంను బీసీ మహిళకు కేటాయించారు. కానీ మండల ఎన్నికల అధికారి కురిచేడు దక్షిణం స్థానంలో బీసీ మహిళలతో నామినేషన్లు వేయించినట్లు సమాచారం. దీంతో అభ్యర్థుల నామినేషన్లు చెల్లకుండా పోయాయని కొందరు, కొందరు కూటమి నాయకులను సైతం మోసం చేశారని వారిలో వారే తిట్లపురాణం అందుకున్నారు. కొందరు కూటమి అభ్యర్థులతో అప్పటికప్పుడు నామినేషన్లు మార్చి వేయించి తన స్వామి భక్తిని చాటుకున్నారు.


