గిద్దలూరు రూరల్: ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న ప్రభుత్వానికి ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ గిద్దలూరు ఇన్‌చార్జి కేపీ నాగార్జునరెడ్డి షన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి చంద్రబాబు పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ భూమా నరసింహారెడ్డిని చైర్మన్‌గా గెలిపించాలని కోరుతూ పట్టణంలోని 11,12,13 వార్డుల్లోని గర్రెవారి వీధి, పొట్టి శ్రీరాములు రోడ్డు, లైబ్రరివీధి, ప్రశాంతినగర్‌లల్లో ఆదివారం ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిరువ్యాపారస్తుల వద్దకు, ప్రతి ఇంటికి తిరుగుతూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ పీఠం వైఎస్సార్ సీపీ కై వసం చేసుకునేలా ప్రతి కార్యకర్త, నాయకుడు కలిసి ముందుకు సాగాలన్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కూటమి ప్రభుత్వం ఇష్టానుసారంగా పాలన సాగిస్తుందన్నారు. ప్రజలు ఓటు అనే ఆయుధంతో మంచి పరిపాలన అందించే నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగిందన్నారు. కానీ రెండున్నరేళ్ల కూటమి పాలనలో అభివృద్ధి పూర్తిగా అటకెక్కిందన్నారు. సంక్షేమ పథకాలను పూర్తిగా విస్మరించారన్నారు. ఈ క్రమంలో ఎన్నికల్లో ప్రజలు పూర్తిగా ఆలోచన చేసి ఓటు వేయాలని కోరారు. గిద్దలూరు పట్టణం అభివృద్ధి చేసేందుకు ప్రజలు వైఎస్సార్ సీపీని గెలిపించాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు మానం బాలిరెడ్డి, చేరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, కడప వంశీధరరెడ్డి, కడప లక్ష్మీ, బి.ఓబులరావు, పోలేపల్లి శివ, యల్లా మణికంఠ, గోడి వెంకటేశ్వరరెడ్డి, సిఆర్‌ఐ మురళి, మిత్రారెడ్డి, కౌన్సిలర్ అభ్యర్థులు పోలేపల్లె పద్మావతి, షేక్.ఖాదర్‌బీ, కె.శివశంకర్, తదితరులు పాల్గొన్నారు.
అరాచక పాలనకు చరమగీతం పాడాలి
ఫ్యాను గుర్తుపై ఓటు వేసి గెలిపించండి
మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కేపీ నాగార్జునరెడ్డి


