కలెక్టర్‌ ‘మీ కోసం’ రద్దు | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ ‘మీ కోసం’ రద్దు

Oct 25 2026 1:41 AM | Updated on Oct 25 2026 1:41 AM

కలెక్టర్‌ ‘మీ కోసం’ రద్దు ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు పీఆర్‌జీఎస్‌ రద్దు ● ఎస్పీ హర్షవర్థన్‌ రాజు వెల్లడి 26న ఉమ్మడి జిల్లా హాకీ జట్ల ఎంపికలు ● అండర్‌– 14, అండర్‌– 17 బాలబాలికలకు అవకాశం స్క్రూటినీ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్‌పీ మీనా హ్యాండ్‌ బుక్‌పై అవగాహన పెంచుకోవాలి ● జిల్లా ఎన్నికల అబ్జర్వర్‌ హెబ్సిబా రాణి

ఒంగోలు సబర్బన్‌: ప్రకాశం భవన్‌లో సోమవారం కలెక్టర్‌ పి.రాజా బాబు ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం–పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు డీఆర్‌ఓ పి.వెంకట రమణ తెలిపారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రకటనలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు చెప్పారు. జిల్లా యంత్రాంగం మొత్తం ఎన్నికల నిర్వహణలో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఒంగోలు టౌన్‌: ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎస్పీ హర్షవర్థన్‌ రాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉందన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా చూసేందుకు పోలీసులు బందోబస్తు, భద్రతా విధుల్లో నిమగ్నమై ఉన్నారని, దీంతో ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేస్తున్నట్లు వివరించారు.

సంతనూతలపాడు: స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 26వ తేదీ సోమవారం అండర్‌ 14, అండర్‌ 17 విభాగాల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా బాలబాలికల హాకీ జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శులు పి. శివశంకర్‌, ఎం.రాజ్యలక్ష్మి శనివారం సంయుక్త ప్రకటనలో తెలిపారు. సంతనూతలపాడు మండలం మైనంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ ఎంపికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు తప్పనిసరిగా లీప్‌ యాప్లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని, 26వ తేదీ ఉదయం 9.30 గంటలకు పాఠశాలకు చేరుకోవాలని సూచించారు. అలాగే అవసరమైన గుర్తింపు నంబర్‌ను వెంట తీసుకురావాలని తెలిపారు. అండర్‌ 14 విభాగంలో నవంబర్‌ 2013 తర్వాత జన్మించిన వారు, అండర్‌ 17 విభాగంలో నవంబర్‌ 2010 తర్వాత జన్మించిన వారు ఎంపికలకు అర్హులని వివరించారు. మరిన్ని వివరాలకు పీఈటీలు డి.శ్రీనివాసరావు 7989440879, తిరుమలశెట్టి రవికుమార్‌ 9951578357లను సంప్రదించాలని సూచించారు.

మార్కాపురం టౌన్‌: పట్టణంలోని మెప్మా కార్యాలయంలో ఏర్పాటు చేసిన జెడ్పీటీసీ నామినేషన్ల స్క్రూటినీ కేంద్రాన్ని ఎస్పీ పంకజ్‌ కుమార్‌ మీనా శనివారం పరిశీలించారు. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు చేపట్టిన భద్రతా ఏర్పాట్లను సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా కేంద్రం వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీస్‌ అధికారులు, బందోబస్తు సిబ్బందికి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేస్తూ, విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు.

ఒంగోలు సబర్బన్‌: ఎన్నికల సంఘం రూపొందించిన హ్యాండ్‌ బుక్‌ (మ్యాన్యువల్‌)పై రిటర్నింగ్‌ అధికారులు సంపూర్ణ అవగాహన ఉండాలని జిల్లా ఎన్నికల పరిశీలకులు కె.హెప్సిబా రాణి అన్నారు. మునిసిపల్‌ ఆర్‌వోలు, ఏఆర్‌వోలు, ఈవోలు, ఏఈవోలకు ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియపై శనివారం ప్రకాశం భవనంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. హెప్సిబా రాణి మాట్లాడుతూ నామినేషన్ల పూర్తితో ఎన్నికల ప్రక్రియ సగం ముగిసిందన్నారు. ఎన్నికలు, కౌంటింగ్‌ కూడా సజావుగా పూర్తయ్యేలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికలు సమర్థంగా నిర్వహించడానికి నిశిత పరిశీలన, నిరంతర పర్యవేక్షణ అవసరమన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ పీవీ రమణ, అర్బన్‌ ఎలక్షన్‌న్‌ నోడల్‌ ఆఫీసర్‌ ఎం.వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement