దర్శి: దర్శి మండలం బసిరెడ్డిపల్లి ఎంపీటీసీగా తన భార్య అనంతలక్ష్మి నామినేషన్ వేయడానికి వెళితే తనను, తన బావమర్ధిని టీడీపీ మూకలు విచక్షణా రహితంగా కొట్టారని మనస్తాపం చెంది పురుగులమందు తాగి శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేసిన కాసు సుబ్బారెడ్డి ఒంగోలు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి శనివారం ఆస్పత్రికి వెళ్లి సుబ్బారెడ్డిని పరామర్శించారు. ఆయన కుటుంబ ఆరోగ్యం విషయం వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.


