పోలింగ్‌ సామగ్రి పరిశీలన | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ సామగ్రి పరిశీలన

Oct 25 2026 1:41 AM | Updated on Oct 25 2026 1:41 AM

కౌంటింగ్‌లో ఎలాంటి లోపాలు ఉండకూడదు అధికారులను ఆదేశించిన కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి పి.రాజాబాబు

ఒంగోలు సబర్బన్‌: పోలింగ్‌ సామగ్రి నిర్వహణ, కౌంటింగ్‌ ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి పి.రాజాబాబు స్పష్టం చేశారు. జాయింట్‌ కలెక్టర్‌ కల్పనాకుమారితో కలిసి శనివారం ఆయన ఒంగోలు నగర శివారులో ఉన్న రైజ్‌ ఇంజినీరింగ్‌ కాలేజీని సందర్శించారు. ఒంగోలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు సంబంధించిన సామగ్రి డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌, స్ట్రాంగ్‌ రూములు, కౌంటింగ్‌ కేంద్రం కూడా ఈ కాలేజీ ప్రాంగణంలోనే అధికారులు ఏర్పాటు చేశారు. ఈ దృష్ట్యా ఆయా పనుల పురోగతిని కలెక్టర్‌ పరిశీలించారు. ఎన్నికలకు అవసరమైన మొత్తం 101 స్టాట్యూటరీ, నాన్‌ స్టాట్యూటరీ సామగ్రిని నిర్వహిస్తున్న తీరును తనిఖీ చేశారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని 224 పోలింగ్‌ కేంద్రాలకు అవసరమైన ఈ సామగ్రిని ఆయా పోలింగ్‌ స్టేషన్ల వారీగా శనివారం సాయంత్రానికే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఓట్ల లెక్కింపునకు అవసరమైన బారికేడ్ల ఏర్పాటు, బ్యాలెట్‌ బాక్స్‌లను సిద్ధం చేసిన తీరును కూడా ఆయన పరిశీలించారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement