గుండ్లకమ్మ రిజర్వాయర్‌లో చేపపిల్లల విడుదల | - | Sakshi
Sakshi News home page

గుండ్లకమ్మ రిజర్వాయర్‌లో చేపపిల్లల విడుదల

Oct 24 2026 9:44 AM | Updated on Oct 24 2026 9:44 AM

మద్దిపాడు: మండలంలోని కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ జలాశయంలో శుక్రవారం ఉదయం స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ మాధురి, మత్స్యశాఖ జేడీ శ్రీనివాసరావు చేపపిల్లలు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాధురి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మత్స్యకారుల కోసం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని జీవనప్రమాణాలు మెరుగుపరుచుకోవాలని సూచించారు. జేడీ శ్రీనివాసరావు మాట్లాడుతూ గుండ్లకమ్మ రిజర్వాయర్‌లో మొత్తం 11,58,000 చేపపిల్లలు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. చేపపిల్లల బరువు తూచి రిజర్వాయర్‌లోకి వదులుతున్నట్లు తెలిపారు. చేపపిల్లలను పట్టకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. రిజర్వాయర్‌లో లైసెన్సు లేకుండా పలువురు వ్యక్తులు చేపలు పడుతున్నారని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ చేపలు పడుతుంటే తమకు జీవనాధారం పోతోందని అధికారుల ఎదుట పలువురు మత్స్యకారులు వాపోయారు. గుండ్లకమ్మ రిజర్వాయర్‌లో ఉన్న లైసెన్స్‌డ్‌ చేపల వేటగాళ్లు బయటి ప్రాంతాల వ్యక్తులను రానీయవద్దని, అధికారులు కూడా మీకు సహకరిస్తారని జేడీ తెలిపారు.

స్థానిక మత్స్యకారులు ఎక్కువ మంది బుట్టలు పెడుతున్నారని, వాటివలన చేపపిల్లలు చిక్కిపోతాయని, బుట్టలు పెట్టకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను జేడీ ఆదేశించారు. బుట్టలు తీసుకొస్తున్న మత్స్యకారులను స్వయంగా ఆపి ప్రశ్నించారు. బుట్టలు పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొందరు మత్స్యకారులు తమకు మోపెడ్‌, బాక్స్‌లు కావాలని జేడీని కోరారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యకారుల సంఘ అధ్యక్షుడు పేరయ్య, ఎఫ్‌డీఓ ఆశా, ఏఎఫ్‌ఓ రమేష్‌, ఫీల్డ్‌మెన్‌ తిరుపతయ్య, వీఎఫ్‌ఏ స్వప్న, సాగరమిత్రలు, మత్స్యకార నాయకులు జీవరత్నం, సిరిబాబు, మేకల శ్రీను, లాజర్‌, రమేష్‌, ఇండ్ల శ్రీను, కావూరి అంకమ్మరావు, రాజు, యోహాన్‌, తదితర మత్స్యకారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement