ప్రకృతి వ్యవసాయాన్ని సందర్శించిన అంతర్జాతీయ బృందం | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి వ్యవసాయాన్ని సందర్శించిన అంతర్జాతీయ బృందం

Oct 24 2026 9:44 AM | Updated on Oct 24 2026 9:44 AM

ప్రకృతి వ్యవసాయాన్ని సందర్శించిన అంతర్జాతీయ బృందం

ఒంగోలు సిటీ: రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలు మండలం యరజర్ల గ్రామంలో నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని న్యూయార్క్‌ నుంచి వచ్చిన అంతర్జాతీయ ప్రతినిధుల బృందం, రాష్ట్ర కార్యాలయ ప్రతినిధులు శుక్రవారం సందర్శించారు. మామిడి మొక్కల మధ్యలో చేపట్టిన పీఎండీఎస్‌ (ప్రీ–మాన్సూన్‌ డ్రై సోయింగ్‌) విధానాన్ని, ఏటీఎం (ఎనీ టైమ్‌ మనీ) విధానంలో సాగు చేస్తున్న వివిధ రకాల కూరగాయలు, ఇతర పంటలను పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయంలో అంతర పంటల సాగు, భూమిని సమర్థంగా వినియోగించుకోవడం, రైతులకు ఏడాది పొడవునా ఆదాయం పొందే అవకాశాలను ప్రకృతి వ్యవసాయ యూనిట్‌ ఇన్‌చార్జి రాధా సింగమనేని వివరించారు. అనంతరం రైతు బబ్బూరి హరిబాబు నిమ్మ తోటను సందర్శించి అక్కడ అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పరిశీలించారు. జీవామృతం తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా చూశారు. పేస్‌ కాలేజీ ఫీల్డ్‌ను కూడా బృందం సందర్శించగా, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement