గూడేల్లో వసతుల కల్పనకు కృషి | - | Sakshi
Sakshi News home page

గూడేల్లో వసతుల కల్పనకు కృషి

Oct 24 2026 9:44 AM | Updated on Oct 24 2026 9:44 AM

గూడేల్లో వసతుల కల్పనకు కృషి

● తుమ్మలబైలులో పర్యటించిన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి మురళీధర్‌రెడ్డి

పెద్దదోర్నాల: గిరిజనగూడేల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి మురళీధర్‌రెడ్డి తెలిపారు. పెద్దదోర్నాల మండల పరిధిలోని తుమ్మలబైలు గిరిజన గూడేన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. మండలంలో రెండో రోజు పర్యటించి తుమ్మలబైలు గిరిజన గూడెంలో సమస్యలు తెలుసుకున్నారు. గూడెంలో ఐటీడీఏ, ఆర్‌డీటీ స్వచ్ఛంద సంస్థల సహకారంతో నిర్వహిస్తున్న మాడపాకులతో ప్రసాదం కప్పులు, భోజనం ప్లేట్ల తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఉఫాది హామీ పథకం ద్వారా సాగుచేస్తున్న మామిడి తోటను సందర్శించారు. గూడెంలో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర సమరయోధులైన హనుమంతప్ప, బయ్యన్నల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఐటీడీఏ శ్రీశైలం ప్రాజెక్టు అధికారి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement