గుర్తు తెలియని వాహనం ఢీకొనిఇద్దరు యువకుల మృతి | - | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని వాహనం ఢీకొనిఇద్దరు యువకుల మృతి

Oct 23 2026 7:18 AM | Updated on Oct 23 2026 7:18 AM

గుర్తు తెలియని వాహనం ఢీకొనిఇద్దరు యువకుల మృతి కందుకూరులో భారీ చోరీ ముగిసిన నామినేషన్ల ఉప సంహరణ పర్వం

ఒంగోలు టౌన్‌: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం...ఒంగోలు నగరంలోని రాంనగర్‌ 2వ లైనుకు, పేర్నమిట్టకు చెందిన కొండప నాయుడు (25), రిత్విక్‌ రెడ్డి (24) అనే ఇద్దరు యువకులు పెళ్లూరు, వల్లూరు గ్రామాల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. టంగుటూరు వైపు నుంచి ఒంగోలు వస్తుండగా మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ప్రమాదం జరిగింది.. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు భావిస్తున్నారు. తాలుకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు.

● రూ 40 లక్షల విలువైన బంగారు ఆభరణాలు మాయం

కందుకూరు: పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. దసరా వేడుకల వేళ దాదాపు రూ. 40 లక్షల విలువైన బంగారు ఆభరణాలు అపహరించారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని కాళిదాసువారి వీధిలో నివాసం ఉండే రిటైర్డు బ్యాంకు ఉద్యోగి దాసరి రమణయ్య కుటుంబం మంగళవారం మధ్యాహ్నం కాలనీలో జరిగిన అమ్మవారి ఊరేగింపు ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఉత్సవాల తరువాత కాలనీలోని వారంతా కలిసి పాకల సముద్రతీరానికి వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో వృద్ధుడైన రమణయ్య మాత్రమే ఇంట్లో ఉన్నాడు. సముద్ర స్నానికి వెళ్లి తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులకు ఇంట్లోని బీరువా వద్ద బంగారు ఉంగరాలు కింద పడి ఉండటాన్ని గమనించారు. ఆందోళనతో బీరువా తాళాలు తీసి చూడగా బీరువాలో ఉండాల్సిన దాదాపు రూ 40 లక్షల విలువైన 200 గ్రాముల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. అయితే బీరువాకు వేసిన తాళాలు వేసినట్టే ఉండడం, బంగారం మాత్రం మాయం కావడంపై బాగా తెలిసిన వారు చేసిన పనే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అయితే బుధవారం సాయంత్రం వరకు కూడా పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించలేదు. ఎస్సైకి విషయం చెప్పితే తాను అందుబాటులో లేనని, తరువాత వచ్చి చూస్తానంటూ చెప్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మున్సిపాలిటీల్లో నామినేసన్ల ఉపసంహరణ పర్వం బుధవారంతో ముగిసింది. అద్దంకిలో వైఎస్సార్‌ సీపీ, టీడీపీ, ఇండిపెండెంట్ల నుంచి ఏడు నామినేషన్లు దాఖలా కాగా ఒకటి ఉపసంహరించుకోగా, ఆరు నామినేషన్లు మిగిలాయి. గిద్దలూరులో మున్సిపల్‌ ఎన్నికల బరిలో 28 వార్డులకు సంబంధించి 5 మంది చైర్మన్లు, 85 మంది కౌన్సిలర్లు పోటీలో నిలబడనున్నట్లు కమిషనర్‌ ఈ.వి.రమణబాబు బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. మొత్తం 123 మంది కౌన్సిలర్లు నామినేషన్లు వేయగా అందులో 38 మంది వారి నామినేషన్లు ఉపసంహరణ చేసుకున్నారు. 17 మంది చైర్మన్‌ అభ్యర్దులుగా నామినేషన్‌ వేసి 12 మంది ఉపసంహరించున్నారు. 5 మంది ఎన్నికల బరిలో నిలువనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement