టీడీపీ గూండాలు బరితెగించారు | - | Sakshi
Sakshi News home page

టీడీపీ గూండాలు బరితెగించారు

Oct 23 2026 2:15 AM | Updated on Oct 23 2026 2:15 AM

ఒంగోలు సబర్బన్‌: కొండపి అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం రాష్ట్ర మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి, మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య కనుసన్నల్లో జరుగుతున్నాయని, అధికారులు, పోలీసులు సైతం ఎన్నికల నిబంధనలు అతిక్రమించి టీడీపీ నాయకులు ఏం చెబితే అదే చేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పి.రాజాబాబుకు ఫిర్యాదు చేశారు. కొండపి, పొన్నలూరు, మర్రిపూడి మండలాల వైఎస్సార్‌ సీపీ నాయకులతో కలిసి గురువారం ఒంగోలు వచ్చిన ఆదిమూలపు సురేష్‌.. స్థానిక ప్రకాశం భవన్‌లో కలెక్టర్‌ను కలిసి కొండపి నియోజకవర్గంలో టీడీపీ గూండాలు, వారికి తోడుగా పోలీసులు చేస్తున్న అరాచకాలను పూసగుచ్చినట్లు వివరించారు. వైఎస్సార్‌ సీపీ తరఫున జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులుగా నామినేషన్లు వేయడానికి వెళ్తున్న వారిని అడ్డగించి మరీ నామినేషన్‌ పత్రాలు లాక్కుని చించివేశారని కలెక్టర్‌కు వివరించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తూ ప్రేక్షకపాత్ర వహించారన్నారు. కందుకూరు డీఎస్పీ రఘురామయ్య కొండపి సీఐ రమణయ్యలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు. కొండపి మండలం వెన్నూరు ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల నామినేషన్లు పడకూడదని దామచర్ల సత్య చెప్పి మరీ అరాచకాలు సృష్టిస్తున్నారన్నారు. ఏకగ్రీవం చేయాలన్నదే మంత్రి స్వామి, దామచర్ల సత్య కుట్రగా ఉందన్నారు. నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు అనుమోలు రాజా, అనుమోలు సుధాకర్‌, మండవ మురళి, దాసరి కృష్ణారావు, మాదాల శ్రీనుతో పాటు బయట ప్రాంతాలైన చీరాల, హైదరాబాద్‌ నుంచి గూండాలను పొన్నలూరులో దించారని వివరించారు. కొండపికి చెందిన కిరణ్‌, బూదాటి రవి, నేతి రవి, కట్టుబడిపాలెం దామా మురళి, గొర్రెపాటి రామయ్య, ఆయన తమ్ముడు శ్రీనివాసరావు, పోలినేని వెంకటేశ్వర్లు, ఏకంగా వైఎస్సార్‌ సీపీ నాయకుల నుంచి నామినేషన్‌ పత్రాలు లాక్కుని చించివేసిన ఏడూరి శంకర్‌, ఉప్పలపాడు బ్రాందీ షాపులో పనిచేసే టీడీపీ నాయకుడు కోటా వెంకటేశ్వర్లు, మర్రిపూడి మండలంలో అరాచకాలు సృష్టిస్తున్న టీడీపీ నాయకుల పేర్లను కలెక్టర్‌కు ఆదిమూలపు సురేష్‌ వివరించారు. వారిలో టీడీపీ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాకినేని శ్రీను, మర్రిపూడి నరసింహస్వామి గుడి చైర్మన్‌ గొంటు హనుమారెడ్డి, మాజీ జెడ్పీటీసీ తుళ్లూరు నరసారెడ్డి, లెక్కల భాస్కర్‌తో పాటు మరికొండరు కలిసి దుర్మార్గాలు చేశారని చెప్పారు. టీడీపీ నాయకులతో కలిసి కందుకూరు డీఎస్పీ, కొండపి సీఐ, పొన్నలూరు ఎస్‌ఐలు, సిబ్బంది ఎన్నికల నిబంధనలను అడ్డంగా ఉల్లంఘించి టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆదిమూలపు సురేష్‌ వెంట వైఎస్సార్‌ సీపీ కొండపి నియోజకవర్గ నాయకులైన పొన్నలూరు మాజీ జెడ్పీటీసీ బెజవాడ వెంకటేశ్వర్లు, పార్టీ పొన్నలూరు మండల అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి, వైఎస్సార్‌ సీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు కాటా మాధవ్‌, ఐనాబత్తుల మాధవ్‌, తదితరులు పాల్గొన్నారు.

కొండపి నియోజకవర్గంలో మంత్రి స్వామి, దామచర్ల సత్య కనుసన్నల్లో అరాచకాలు చేస్తున్నారు

నామినేషన్లు చించివేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు

గొర్రెపాటి రామయ్య, ఆయన తమ్ముడు శ్రీను అరాచకాలు దారుణం

పోలీసులు సైతం ఎన్నికల నిబంధనలు అతిక్రమించారు

టీడీపీ రౌడీలకు వత్తాసు పలుకుతున్నారు

వైఎస్సార్‌ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌

వైఎస్సార్‌ సీపీ నాయకులతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజాబాబుకు ఫిర్యాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement