కంభంలో జనసేన వర్సెస్‌ టీడీపీ | - | Sakshi
Sakshi News home page

కంభంలో జనసేన వర్సెస్‌ టీడీపీ

Oct 23 2026 2:15 AM | Updated on Oct 23 2026 2:15 AM

కంభంలో జనసేన వర్సెస్‌ టీడీపీ

కంభం: కంభం మండల కేంద్రంలో ఎంపీటీసీల నామినేషన్ల కార్యక్రమం గురువారం టీడీపీ వర్సెస్‌ జనసేనలా సాగింది. ఉదయం చిన్నకంభం ఎంపీటీసీ స్థానానికి జనసేన అభ్యర్థి నామినేషన్‌ వేసేందుకు రాగా, టీడీపీ నాయకులు అడ్డుకుని వెనక్కి పంపించేశారు. రెండు పార్టీల నాయకుల మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. సాయంత్రం 4.30 గంటల తర్వాత మరో జనసేన మహిళా అభ్యర్థి నామినేషన్‌ వేసేందుకు రాగా, లోపలికి వెళ్లనీయకుండా టీడీపీ నాయకులు విశ్వప్రయత్నాలు చేశారు. సమయం ముగిసిపోయే వరకు వారిని లోపలికి వెళ్లనీయకపోవడంతో వెనుతిరడం వారి వంతైంది. మొత్తానికి గురువారం టీడీపీ వారివి 2 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. కూటమిలో భాగంగా 30 శాతం సీట్లు తమకు కేటాయిస్తామని చెబుతున్నప్పటికీ.. ఇలా తమను నామినేషన్లు దాఖలు చేయనీయకుండా అడ్డుకోవడం అన్యాయమని జనసేన నేతలు వాపోయారు. పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటామని వారు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement