నామినేషన్‌ కేంద్రాల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

నామినేషన్‌ కేంద్రాల పరిశీలన

Oct 19 2026 2:13 AM | Updated on Oct 19 2026 2:13 AM

నామినేషన్‌ కేంద్రాల పరిశీలన లారీని ఢీకొని ఐషర్‌ డ్రైవర్‌ మృతి ఆటో బోల్తాపడి వ్యక్తి దుర్మరణం

ఒంగోలు సబర్బన్‌: నగరంలోని నామినేషన్‌ కేంద్రాలను ఆదివారం జాయింట్‌ కలెక్టర్‌, జిల్లా అదనపు ఎన్నికల అధికారి కల్పనా కుమారి క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగరంలోని డీఆర్‌ఆర్‌ఎం మున్సిపల్‌ హైస్కూల్‌, రామానగర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాల, పీవీఆర్‌ బాలుర హైస్కూల్స్‌లో ఏర్పాటు చేసిన నామినేషన్‌ కేంద్రాలను సందర్శించి, అక్కడ నామినేషన్ల స్వీకరణ కోసం చేసిన ఏర్పాట్లను, మౌలిక వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ నామినేషన్‌ ప్రక్రియ మొత్తాన్ని సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని, ప్రతి రికార్డును పా రదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆశించారు. నగరపాలక సంస్థ కమిషనర్‌ కృష్ణయ్య, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మద్దిపాడు: ముందు వెళుతున్న తమిళనాడు లారీని ఐషర్‌ వాహనం ఢీకొన్న ఘటనలో హైదరాబాద్‌ నాగోల్‌కు చెందిన డ్రైవర్‌ మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం తెల్లవారు జామున జాతీయరహదారిపై జరిగి,ది. వివరాల్లోకి వెళితే..నాగోల్‌కు చెందిన శిరగోరి నరహరి (35) ఈరోడ్‌ నుంచి హైదరాబాద్‌కు ఐషర్‌ వాహనంలో లోడు తీసుకుని వెళుతున్న క్రమంలో మండలంలోని గుండ్లాపల్లి ఫ్‌లైఓవర్‌ పై ఒంటి గంట సమయంలో ముందు వెళుతున్న తమిళనాడు లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఐషర్‌ క్యాబిన్‌ నొక్కుకు పోయి నరహరి ఐషర్‌ వాహనంలో ఇరుక్కుపోయాడు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో హైవే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నరహరిని క్యాబిన్‌ నుంచి బయటకు లాగారు. అనంతరం అతనిని ఒంగోలు రిమ్స్‌కు తరలించగా అక్కడ ఆయన చికిత్స పొందుతూ 2.30 గంటల సమయంలో మృతి చెందినట్లు స్టేషన్‌కు సమాచారం వచ్చింది. మృతుని భార్య స్వప్న ఫిర్యాదు మేరకు మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కొత్తపట్నం: ఆటో బోల్తా పడి వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. కొత్తపట్నం గంగమ్మ కాలనీలో నివాసం ఉంటున్న కట్టా సంతోష్‌ (45) జీవాలను కోసి మాంసం విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం కొత్తపట్నం నుంచి ఆటోలో గాడెదను ఎక్కించుకుని అదే గ్రామానికి చెందిన ఫిలిప్‌తో కలిసి గమళ్లపాలెం వెళ్లారు. అక్కడ మాంసం విక్రయించి తిరిగి వస్తుండగా ఆటో బోల్తా పడింది. ప్రమాదంలో బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్సై వేముల సుధాకర్‌ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement