ఊపందుకున్న నామినేషన్లు | - | Sakshi
Sakshi News home page

ఊపందుకున్న నామినేషన్లు

Oct 18 2026 2:36 AM | Updated on Oct 18 2026 2:36 AM

సాక్షి ప్రతినిధి,ఒంగోలు : ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మున్సిపాలిటీ, నగరపంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో రోజు శనివారం నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. అద్దంకిలో 37, మార్కాపురంలో 88, దర్శిలో 17, చీమకుర్తిలో 50, గిద్దలూరులో 50, కనిగిరిలో 50, ఒంగోలులో 119 నామినేషన్లను వివిధ పార్టీల తరఫున అభ్యర్థులు సపర్పించారు. మొత్తంగా 411 నామినేషన్లు వచ్చాయి. ఒంగోలులో వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి కుప్పం ప్రసాద్‌ తరఫున ఆయన సతీమణి, అద్దంకి చైర్మన్‌ అభ్యర్థి ఉడత్తు సురేష్‌, కనిగిరి చైర్‌పర్సన్‌ అభ్యర్థి పులిశాంతిరెడ్డి, మార్కాపురంలో చైర్‌పర్సన్‌ అభ్యర్థి కనక దుర్గ తరఫున మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి అన్నారాంబాబు నామినేషన్‌ వేశారు.

కుప్పం తరఫున రెండు సెట్ల నామినేషన్లు

ఒంగోలు సబర్బన్‌: వైఎస్సార్‌ సీపీ ఒంగోలు మేయర్‌ అభ్యర్థి కుప్పం ప్రసాదు తరఫున ఆయన సతీమణి కుప్పం ప్రసన్నకుమారి మేయర్‌ డమ్మీ అభ్యర్థిగా శనివారం నామినేషన్‌ వేశారు. ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం రిటర్నింగ్‌ అధికారి, ఒంగోలు ఆర్డీఓ టి.చంద్రశేఖరనాయుడుకు నామినేషన్‌ పత్రాలు అందజేశారు. అదేవిధంగా ఒక సెట్‌ భర్త నామినేషన్‌ కూడా రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు. దాంతో రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లయింది. నామినేషన్‌ కార్యక్రమానికి వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయం నుంచి మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు అదేకారులో కుప్పం ప్రసాదు దంపతుల వెంట ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయం వరకూ వచ్చారు. నామినేషన్‌ పత్రాలు సమర్పించే సమయంలో కుప్పం ప్రసన్న కుమారి వెంట వైఎస్సార్‌ సీపీ లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, రాష్ట్ర సూర్యబలిజ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ దాసరి కరుణాకర్‌తో పాటు పలువురు వైఎస్సార్‌ సీపీ నాయకులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement