కనిగిరి: పొక్లెయిన్ తగిలి దివ్యాంగుడు మృతిచెందిన సంఘటన శుక్రవారం పామూరు బస్టాండ్ వద్ద చర్చి సెంటర్ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెలిగండ్ల మండలం ఎంపీడీఓ కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్న దివ్యాంగుడైన తమ్మనేని ప్రదీప్‌రెడ్డి (36) రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, వేగంగా వచ్చిన పొక్లెయిన్ ఢీకొట్టింది. అతనిపైకి వాహనం ఎక్కడంతో కాళ్లకు, పొట్టకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలిస్తుండగా మార్గమధ్యంలో అతను మరణించాడు. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


