వైఎస్సార్‌ సీపీ గెలుపు ఖాయం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ గెలుపు ఖాయం

Oct 17 2026 8:30 AM | Updated on Oct 17 2026 8:30 AM

పార్టీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి వైఎస్సార్‌ సీపీలో చేరిన టీడీపీ నాయకులకు ఆహ్వానం

గిద్దలూరులో వైఎస్సార్‌ సీపీలో చేరుతున్న వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానిస్తున్న కేపీ నాగార్జునరెడ్డి

టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలో చేరిన నాయకులు

గిద్దలూరు రూరల్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల గెలుపు ఖాయమని ఆ పార్టీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి స్పష్టం చేశారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో గల వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో శుక్రవారం గిద్దలూరు మున్సిపాలిటీలోని 18వ వార్డుకు చెందిన టీడీపీ నాయకుడు మానం ప్రభాకర్‌రెడ్డి, 24వ వార్డు నుంచి చింతలపూడి బాలరాజుయాదవ్‌, 26వ వార్డు నుంచి షేక్‌ హారోన్‌, 12వ వార్డుకు చెందిన అల్తాఫ్‌, ఖాదర్‌బీ, మరికొంతమంది కేపీ నాగార్జునరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించిన కేపీ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉందని, అదే మనల్ని గెలిపిస్తుందని అన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేసే బాధ్యతను ప్రతి కార్యకర్త, నాయకుడు భుజాలపై వేసుకోవాలని సూచించారు. ప్రజల్లో వైఎస్సార్‌ సీపీపై చెరగని అభిమానం ఉందన్నారు. ప్రతి కార్యకర్త, నాయకుడు కలిసికట్టుగా పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. పార్టీకి కార్యకర్తలే నిజమైన మూలస్తంభాలన్నారు. వైఎస్సార్‌ సీపీ కోసం ప్రతి కార్యకర్త, నాయకుడు అంకిత భావంతో పనిచేయాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యూహాలు రచించుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నప్పటికీ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలను పార్టీ ఎప్పటికీ విస్మరించదన్నారు. చంద్రబాబు నిరంకుశ పాలనపై ప్రజలు పూర్తిగా విసిగివేసారిపోయారన్నారు. ప్రజల నుంచి వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలను వేరు చేసి ఏకపక్షంగా చంద్రబాబు మాట్లాడటం చాలా దారుణమన్నారు. కార్యకర్తలకు అండగా నిలబడి వారి తరఫున పోరాడేందుకు పార్టీ, తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కార్యకర్తలు ఐక్యమత్యంతో ముందుకు సాగాలని సూచించారు. జగనన్న పాలనలో అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందారని, నేడు కూటమి పాలనలో ఆ పరిస్థితి లేదని అన్నారు. వైఎస్సార్‌ సీపీ అధిష్టానం ఆదేశాలకు కట్టుబడి ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు కలిసిమెలిసి పనిచేసి గిద్దలూరు మున్సిపాలిటీలో అఖండ విజయం సాధించాలని పిలుపునిచ్చారు. జగనన్నను తిరిగి మనం ముఖ్యమంత్రిగా చూసేందుకు సైనికులవలే పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే జగనన్న ప్రభుత్వంలో కార్యకర్తల అభీష్టం మేరకే పరిపాలన సాగుతుందని కేపీ నాగార్జునరెడ్డి స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు డాక్టర్‌ భూమా నరసింహారెడ్డి, కడప వంశీధరరెడ్డి, చేరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, మానం బాలిరెడ్డి, బొర్రా క్రిష్ణారెడ్డి, డాక్టర్‌ రఫీ, ఈదుల పాండురంగారెడ్డి, రాజయ్యయాదవ్‌, గఫూర్‌, వెంకటరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement