స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి | - | Sakshi
Sakshi News home page

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి

Oct 17 2026 8:30 AM | Updated on Oct 17 2026 8:30 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌

హాజరైన వైఎస్సార్‌ సీపీ శ్రేణులు

మర్రిపూడి: స్థానిక ఎన్నికల సమరానికి వైఎస్సార్‌ సీపీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ పీఏసీ సభ్యుడు, కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. శుక్రవారం మర్రిపూడిలో పార్టీ మండల అధ్యక్షుడు ఇనుకొల్లు సుబ్బారెడ్డి నివాసంలో పార్టీ మండల నాయకులతో స్థానిక సంస్థల ఎన్నికలపై సమావేశం నిర్వహించి మాట్లాడారు. వైఎస్సార్‌ సీపీ తరఫున పోటీలో ఉన్న అభ్యర్థులకు దిశా నిర్దేశం చేసి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందన్నారు. మంత్రి స్వామి అండతో కొండపి నియోజకవర్గంలో పోలీసులు పెచ్చుమీరి ప్రవర్తిస్తున్నారన్నారు. పోలీస్‌ యంత్రాంగం కూటమి నాయకులకు కొమ్ముకాస్తోందని మండిపడ్డారు. ఓటమి భయంతో కూటమి నేతలు గ్రామాల్లో ఎన్నికల రిజర్వేషన్లు మార్పించుకున్నారని విమర్శించారు. వైఎస్సార్‌ సీపీ గ్రామస్థాయి నాయకులను బెదిరించడం, పాతకేసులు తోడటం, అక్రమ కేసులు బనాయించడం, బైండోవర్‌ కేసులు పెట్టడం దారుణమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు వెన్నుపోటు పొడిచే విధంగా రిజర్వేషన్ల డ్రామా నడిచిందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలకే వ్యతిరేకం మూటకట్టుకుందని, రెండున్నర సంవత్సరాలకు ప్రస్తుతం తారాస్థాయికి చేరిందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఓడించాలని కుతూహలంగా ఉన్నారన్నారు. ప్రతి మండలంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవనాలు వీస్తున్నాయన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీకి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారన్నారు. మర్రిపూడి మండలంలోని 11 ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ, 21 గ్రామ పంచాయతీలకు పోటీచేసే అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బరిలో ఉన్న అభ్యర్థులు ఎలాంటి బెదిరింపులకు లోను కాకూడదన్నారు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తన దృష్టికి తీసుకురావాలన్నారు. కొండపి నియోజకవర్గంలో ఇప్పటికే 80 శాతం అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలిపారు. మరో రెండు రోజుల్లో మిగిలిన గ్రామాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుందని ఆదిమూలపు సురేష్‌ భరోసా ఇచ్చారు. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు ఇనుకొల్లు పిచ్చిరెడ్డి, బోద రమణారెడ్డి, మాకినేని వెంకట్రావు, మాచేపల్లి నాగయ్య, మొల్లల శివరామిరెడ్డి, ఉస్తేలమూరి చెన్నారెడ్డి, బొల్లినేని నాగేశ్వరరావు, ఏ కొండారెడ్డి, పీ కృష్ణమూర్తి, ఐ.మాదిరెడ్డి, జీ రమణారెడ్డి, ఐ.సుబ్బారెడ్డి, పీ సంజివరెడ్డి, వీ అంజిరెడ్డి, గురిజాల రమేష్‌ (చిన్నారి), గురిజాల యోబు, కోండ్రు ఇజ్రాయిల్‌, ఏ కోటేశ్వరరావు, నాగరాజు, నరసింహారావు, ఎం.రమణయ్య, పీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపించుకోవాలి

ఓటమి భయంతోనే రిజర్వేషన్లు మార్చిన కూటమి

వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement