● రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు
పెద్దదోర్నాల: ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఒకదానికొకటి ఢీకొని ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన పెద్దదోర్నాలలోని శ్రీశైలం రహదారిలోని టీవీఎస్ షోరూం ఎదురుగా శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మండల కేంద్రంలోని సుందరయ్య కాలనీకి చెందిన పాల్తి శివస్వామినాయక్ తీవ్రంగా గాయపడ్డాడు. మరో ద్విచక్రవాహనంపై ఉన్న యువకుడికి ఎటువంటి గాయాలు కాలేదు. ప్రమాద సమాచారం తెలుసుకున్న 108 ఈఎంటీ బాసా, పైలట్ ప్రశాంత్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని పెద్దదోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటకు సిఫార్సు చేశారు.
సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.


