పటిష్ట భద్రత చర్యలు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

పటిష్ట భద్రత చర్యలు చేపట్టాలి

Oct 16 2026 10:28 AM | Updated on Oct 16 2026 10:28 AM

ఒంగోలు సబర్బన్‌: మున్సిపల్‌ ఎన్నికలకు పటిష్ట భద్రత చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పి.రాజాబాబు సూచించారు. మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించిన స్ట్రాంగ్‌ రూమ్స్‌, కౌంటింగ్‌ సెంటర్‌, రిసెప్షన్‌, డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ల ఏర్పాటు కోసం నగరంలోని క్విస్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, రైజ్‌ ఇంజినీరింగ్‌ కళాశాల భవన సముదాయాలను ఎస్పీ వి.హర్షవర్థన్‌ రాజుతో కలిసి కలెక్టర్‌ గురువారం పరిశీలించారు. పురపాలక సంఘాల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్‌ చెప్పారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన స్ట్రాంగ్‌ రూమ్స్‌ను జిల్లా కేంద్రం ఒంగోలు నగరంలోనే ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను అనుసరించి రిసెప్షన్‌ సెంటర్‌, డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లు ఉండాలన్నారు. అదే మాదిరిగా స్ట్రాంగ్‌ రూమ్స్‌, కౌంటింగ్‌ సెంటర్లు ఎన్నికల కమిషన్‌ సూచించినట్లుగానే ఏర్పాటు చేయాలన్నారు. నిబంధనలు పక్కాగా పాటించాలని పలు సూచనలు చేశారు. పటిష్టమైన భద్రత మధ్య స్ట్రాంగ్‌ రూమ్స్‌, కౌంటింగ్‌ సెంటర్లో ఉండేలా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలు తూచా తప్పకుండా పాటించాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు, డీఆర్‌ఓ పి.వెంకటరమణ, జెడ్పీ సీఈవో చిరంజీవి, ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్‌ వెంకట కృష్ణయ్య, తదితర మున్సిపాలిటీల కమిషనర్లు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సీహెచ్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

మున్సిపల్‌ ఎన్నికలకు స్ట్రాంగ్‌ రూమ్స్‌

ఎంపిక చేయాలి

పలు కళాశాలలను

పరిశీలించిన కలెక్టర్‌ రాజాబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement