కొనకనమిట్ల:
ఇటీవల పల్నాడు జిల్లా కారంపూడిలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్–14 రెజ్లింగ్ పోటీల్లో పాల్గొని సత్తా చాటిన గొట్లగట్టు జెడ్పీ పాఠశాల విద్యార్థి పి.సాంబశివ జాతీయస్థాయి పోటీలకు ఎంపియ్యారని పాఠశాల హెచ్‌ఎం టి.ఆదినారాయణ, పీడీ ఎన్.ఝాన్సీరాణి అన్నారు. పీడీ ఝాన్సీరాణి మాట్లాడుతూ పాఠశాలకు చెందిన క్రీడాకారులు పి.సాంబశివ, వి.ప్రతాప్‌లు పాకలలో జరిగిన జిల్లాస్థాయి అండర్–14 రెజ్లింగ్ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరచటంతో కారంపూడిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని అన్నారు. క్రీడాకారులను అభినందించారు.


