బాణసంచా దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

బాణసంచా దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

Oct 15 2026 8:06 AM | Updated on Oct 15 2026 8:06 AM

వివిధ శాఖల అధికారులతో సమీక్షలో డీఆర్‌ఓ వెంకట రమణ

ఒంగోలు సబర్బన్‌: ప్రకాశం జిల్లాలో దీపావళి పండుగను పురస్కరించుకొని, బాణసంచా విక్రయించడానికి తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేయదలచిన వ్యాపారులు దరఖాస్తు చేసుకోవాలని డీఆర్‌ఓ కే.వెంకట రమణ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన తన చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 15 నుంచి 24వ తేదీ వరకు సంబంధిత మీ సేవా కేంద్రాలు, గ్రామ– వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అందు కోసం దరఖాస్తుతో పాటు చిరునామా ధ్రువీకరణ పత్రం, ఆధార్‌ కార్డు నకలు, మూడు పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలు, వయస్సు ధ్రువీకరణ పత్రం, రూ.10 స్టాంప్‌ పేపర్‌ నోటరీ చేయించిన అఫిడవిట్‌, వాణిజ్య శాఖ ఎన్‌ఓసీ, పోలీసు శాఖ ధ్రువీకరణ పత్రం, అగ్నిమాపక శాఖ ధ్రువీకరణ పత్రం, సంబంధిత గ్రామ పంచాయతీ, మునిసిపాలిటీ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలన్నారు. 18 ఏళ్లలోపు వయస్సున్న వారికి లైసెన్సులు మంజూరు చేయరన్నారు. సంబంధిత అధికారులు గుర్తించిన అనువైన ప్రదేశాల్లో మాత్రమే తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. రద్దీ ప్రాంతాలు, జనావాసాల మధ్య దుకాణాలకు అనుమతి ఉండదన్నారు. బాణసంచా దుకాణాల చుట్టూ 50 మీటర్ల పరిధిలో తగిన ఖాళీ స్థలం ఉండేలా చూడాలన్నారు. ఒక దుకాణానికి మరొక దుకాణానికి మధ్య కనీసం 3 మీటర్ల దూరం ఉండాలని, ప్రతి దుకాణం వద్ద అగ్నిప్రమాద నివారణ చర్యల్లో భాగంగా నీరు, ఇసుక తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. బాణాసంచా విక్రయాలకు వచ్చేనెల 7 నుంచి 9వ తేదీ వరకు మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. 9వ తేదీ సాయంత్రం 7 గంటలలోపు దుకాణాలను ఖాళీ చేయాలన్నారు. ఆసక్తి గల వ్యాపారులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకొని, సంబంధిత నిబంధనలు, భద్రతా సూచనలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement