విద్యుదాఘాతానికి వ్యక్తి బలి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతానికి వ్యక్తి బలి

Oct 14 2026 4:11 AM | Updated on Oct 14 2026 4:11 AM

విద్యుదాఘాతానికి వ్యక్తి బలి రోడ్డు మార్జిన్లోకి దూసుకెళ్లిన కారు 215 పొగాకు బేళ్ల తిరస్కరణ

జె.పంగులూరు: వ్యవసాయం కోసం విద్యుత్‌ స్తంభం ఎక్కి వైర్‌ తగిలించబోయే సమయంలో విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని కొండమంజులూరులో మంగళవారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన కొలకలూరి బాబు (54) పొలానికి నీరు పెట్టేందుకు ప్రయత్నించాడు. ఎల్‌సీ తీసుకోకుండా స్తంభం ఎక్కడంతో ఒక్కసారిగా షాక్‌ తగిలింది. కిందపడటంతో తల వెనుక భాగం వద్ద గాయమై అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్టూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడికి భార్య రాణి, ఇద్దరు కుమారులు ఉన్నారు.

సింగరాయకొండ: నిద్రమత్తు కారణంగా కారు అదుపుతప్పి రోడ్డు మార్జిన్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన మంగళవారం ఉదయం 6.30 గంటల సమయంలో మండల పరిధిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌పై మూలగుంటపాడులోని పోలేరమ్మ గుడి సమీపంలో జరగ్గా ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం...రాజమండ్రికి చెందిన ఓబుల్‌రెడ్డి, రాజేశ్వరిలు తమ కుమార్తెతో కలిసి దసరా సెలవులు రావటంతో కడప నుంచి స్వగ్రామం రాజమండ్రికి కారులో బయలుదేరారు. కారు ఎమర్జెన్సీ ల్యాండింగ్‌పై పోలేరమ్మ తల్లి గుడి సమీపంలోకి రాగానే నిద్రమత్తు కారణంగా కారు అదుపుతప్పి రోడ్డు మార్జిన్లోని గుంతలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. స్వల్ప గాయాలపాలైన భార్యాభర్తలిద్దరిని 108లో ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎల్‌ సుధీర్‌కుమార్‌ వివరించారు.

కొండపి: స్థానిక పొగాకు వేలం కేంద్రంలో మంగళవారం నిర్వహించిన వేలంలో 215 బేళ్లు తిరస్కరణకు గురైనట్లు వేలంకేంద్ర నిర్వహణ అధికారి ఎం శంకరరావు తెలిపారు. క్లస్టర్‌ పరిధిలోని నేతివారిపాలెం, రామచంద్రపురం గ్రామాల రైతులు 1104 బేళ్లను వేలానికి తీసుకురాగా 889 బేళ్లను కొనుగోలు చేసి 215 బేళ్లను తిరస్కరించారు. గరిష్ట ధర రూ.250, కనిష్ట ధర రూ.110, సరాసరి ధర రూ.196.32గా నమోదైంది.

టంగుటూరు: రైతులు వేలానికి అనుగుణంగా నాణ్యమైన పొగాకు బేళ్లు తీసుకొని వచ్చి అధిక ధరలు పొందాలని వేలం నిర్వహణాధికారి సత్య శ్రీనివాస్‌ తెలిపారు. వేలం కేంద్రాన్ని మంగళవారం కారుమంచి గ్రామానికి చెందిన రైతులు 1000 బేళ్లను వేలానికి తీసుకురాగా 834 బేళ్లను కొనుగోలు చేసి 166 బేళ్లను తిరస్కరించారు. గరిష్ట ధర రూ.250, కనిష్ట ధర రూ.110, సరాసరి ధర రూ.195.87గా నమోదైంది. వేలంలో 12 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement