ఎన్నికలే లక్ష్యంగా కేసులు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలే లక్ష్యంగా కేసులు

Oct 14 2026 4:11 AM | Updated on Oct 14 2026 4:11 AM

దర్శి: స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పోలీసులు బైండోవర్‌ కేసులు పెడుతున్నారు. సాధారణంగా రౌడీషీటర్లు, గతంలో గొడవలు చేసిన వారు, వివాదాస్పద వ్యక్తులపై శాంతియుతంగా ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతో బైండోవర్‌ కేసులు పెడుతుంటారు. అయితే దర్శిలో అలా జరగడం లేదు. వైఎస్సార్‌ సీపీలో యాక్టివ్‌గా ఉన్న నాయకులను టార్గెట్‌ చేసి ఎన్నికల్లో పోటీ చేసే వారిపై బైండోవర్‌ కేసులు పెట్టడంపై తీవ్ర విమర్శలకు తావిస్తోంది. మంగళవారం శివరాజనగర్‌కు చెందిన 15 మందిపై బైండోవర్‌ కేసులు పెట్టాలని పిలిపించారు. దీంతో టీడీపీ వారిని కూడా పిలిపించండని పోలీసులను నాయకులు కోరగా వాళ్లతో మీకెందుకు, వాళ్లను తర్వాత పిలిపిస్తామని చెప్పారు. ఎప్పుడూ ఇరుపార్టీల వారిని ఒకేసారి పిలిచి బైండోవర్‌ చేసేవారని, ఇప్పుడు టీడీపీ నాయకులను ఎందుకు బైండోవర్‌ చేయడం లేదని ప్రశ్నించగా పోలీసుల నుంచి మౌనమే సమాధానం వస్తోంది. వార్డుల్లో యాక్టివ్‌గా ఉండే వైఎస్సార్‌ సీపీ వాళ్లను బైండోవర్‌ చేసి టీడీపీలో తూతూమంత్రంగా అనామకుల పేర్లు రాస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇరువురిని ఒకేసారి పిలిపించి బైండోవర్‌ చేయాలని వైఎస్సార్‌ సీపీ నేతలు కోరుతున్నారు.

వార్డుకు 15 మంది వైఎస్సార్‌ సీపీ నేతల బైండోవర్‌

టీడీపీ నేతల వైపు చూడని పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement