అటవీ భూముల్లో జామాయిల్‌ కర్ర నరికివేత | - | Sakshi
Sakshi News home page

అటవీ భూముల్లో జామాయిల్‌ కర్ర నరికివేత

Oct 14 2026 4:11 AM | Updated on Oct 14 2026 4:11 AM

హనుమంతునిపాడు: అటవీ ప్రాంతంలో జామాయిల్‌ కర్రను అక్రమంగా నరికించి సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులను ఫారెస్టు అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. మండల పరిధి కోటతిప్పల రెవెన్యూ ఫారెస్టులో సర్వే నంబర్‌ 67లో 600 ఎకరాల్లో జామాయిల్‌ సాగు ఏపుగా పెరిగి ఉంది. ఇటీవల కొందరు కూలీలను తీసుకెళ్లి ఫారెస్టులో జామాయిల్‌ కర్రను నరికి రహస్యంగా తరలించి సొమ్ము చేసకుంటున్నారు. టన్ను జామాయిల్‌ కర్ర రూ.10 వేలు చొప్పున అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని గ్రామస్తులు ఫారెస్టు అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఫారెస్టు అధికారుల వివరణ

కోటతిప్పల రెవెన్యూ ఫారెస్టు సర్వే నంబర్‌ 67లో జామాయిల్‌ కర్ర నరికిస్తున్న విషయంపై సంబంధిత అధికారులను సాక్షి వివరణ కోరింది. కర్రను దొంగతనంగా నరికి అమ్ముకుంటున్న విషయం వాస్తవమేనన్నారు. మంగళవారం నిందితులు కుందురు నరిసింహారెడ్డి (తిమ్మారెడ్డిపల్లి), ఏలూరి శ్రీనివాసులురెడ్డి (కిచ్చంపల్లి), కె.నారాయణరెడ్డి (దాసరిపల్లి), ముక్కు శ్రీనివాసులురెడ్డి (దాసరిపల్లి)ని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితులు ఇప్పటికే నాలుగు లారీల కర్రను తరలించారని, నలుగురి నుంచి లక్ష రూపాయలు జరిమానా కట్టించుకుని వదిలేశామని చెప్పారు. ఇక నుంచి ఫారెస్టులో జామాయిల్‌ కర్రను దొంగతనంగా విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని ఫారెస్టు డీఆర్‌ఓ నాయక్‌, గార్డు నరిసింహులు తెలిపారు.

లోడ్‌లకు లోడ్‌లు తరలిస్తున్న అక్రమార్కులు

అటవీ అధికారుల అదుపులో నిందితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement