బైకులు ఢీకొని ఇద్దరు మృతి | - | Sakshi
Sakshi News home page

బైకులు ఢీకొని ఇద్దరు మృతి

Oct 13 2026 1:41 AM | Updated on Oct 13 2026 1:41 AM

బైకులు ఢీకొని ఇద్దరు మృతి

పొదిలి రూరల్‌: రెండు బైకులు ఢీకొని ఇద్దరు మృతిచెందగా ఒకరికి తీవ్రగాయాలైన సంఘటన సోమవారం రాత్రి పొదిలి మండలంలోని మల్లవరం సమీపంలోని రాజీవ్‌నగర్‌ వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో పొదిలి మండలం పాములపాడు పంచాయతీలోని గొల్లపల్లికి చెందిన పేరం చెంచిరెడ్డి (55), మూగచింతల గ్రామానికి చెందిన వేల్పుల కార్తీక్‌ (20) మృతి చెందగా, గొల్లపల్లికి చెందిన సోము పుల్లారెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పేరం చెంచిరెడ్డి ఈ నెల 16వ తేదీ జరగనున్న కూతురు పెళ్లికి చెప్పడానికి ద్విచక్ర వాహనంపై సోము పుల్లారెడ్డి వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నారు. మల్లవరం సమీపంలోని రాజీవ్‌నగరం సమీపంలో మూగచింతల గ్రామానికి చెందిన వేల్పుల కార్తీక్‌ బైకుపై ఎదురుగా రాగా ఢీకొన్నారు. దీంతో రెండు వాహనాలపై ఉన్న ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108కు సమాచారం అందించగా, సంఘటన స్థలానికి వచ్చి గాయపడిన వారిని పొదిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలిస్తుండగా మార్గం మధ్యలో పేరం చెంచిరెడ్డి, వేల్పుల కార్తీక్‌ మృతి చెందారు. పుల్లారెడ్డి తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతిచెందిన వారి కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.

మృతిచెందిన పేరం చెంచిరెడ్డి, వేల్పుల కార్తీక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement