అభిమానం | - | Sakshi
Sakshi News home page

అభిమానం

Sep 30 2026 2:34 AM | Updated on Sep 30 2026 2:34 AM

ఒంగోలులో వైఎస్సార్‌ సీపీ నేత కాకుమాను రాజశేఖర్‌ కుటుంబానికి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పరామర్శ అడుగడుగునా వెల్లువెత్తిన అభిమానం భారీగా తరలి వచ్చిన నాయకులు,కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు జై జగన్‌ నినాదాలతో హోరెత్తించిన జెన్‌జీ జగన్‌తో సెల్ఫీ దిగేందుకు పోటీపడిన యువతరం కిలో మీటరు దూరానికి అరగంట ప్రయాణం

ఉప్పొంగిన

అదే ఆప్యాయత...అదే అభిమానం...జననేతను చూడాలని జనం ఉప్పెనలా తరలివచ్చారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా వేలాది మంది తమ అభిమాన నాయకుడిని కలిసేందుకు, దగ్గరకు వెళ్లి చూసేందుకు, కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. దివంగత నేత కాకుమాను రాజశేఖర్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఒంగోలు వచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు అడుగడుగునా నీరాజనం పలికారు. జైజగన్‌ నినాదాలతో యువకులు హోరెత్తించారు.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:

వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానుల ఉత్సాహంతో ఒంగోలు నగరం హోరెత్తింది. పార్టీ పిలుపు లేకుండానే వేలాదిగా జనం ఒంగోలుకు తరలివచ్చారు. ఇటీవల మృతి చెందిన వైఎస్సార్‌ సీపీ ప్రచార విభాగం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, లిడ్‌క్యాప్‌ మాజీ చైర్మన్‌ కాకుమాను రాజశేఖర్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మంగళవారం ఒంగోలుకు వచ్చారు. జగన్‌ వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న అభిమానులు, కార్యకర్తలు భారీగా స్వచ్ఛందంగా తరలివచ్చారు. దీంతో నగరంలోని రైల్వేస్టేషన్‌ రోడ్డు, క్లౌ పేట, ఏబీఎం కాలేజీ రోడ్డు జనాలతో రద్దీగా మారిపోయింది. ఉదయం 8 గంటల నుంచి అభిమానులు, పార్టీ శ్రేణులు ఒక్కొక్కరుగా తరలి రావడంతో ఒంగోలు నగరంలో ఎటు చూసినా వైఎస్సార్‌ సీపీ కార్యకర్తల సందడి కనిపించింది. జిల్లా జైలు వద్ద చౌరస్తా, జాయ్‌ హాస్పిటల్‌ సెంటర్‌ల నుంచి రైల్వే స్టేషన్‌ వరకు ఎటు చూసినా జనమే కనిపించారు. మధ్యాహ్నం గం.11.50 కు రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డితో కలిసి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హెలికాప్టర్‌లో ఒంగోలుకు చేరుకున్నారు. అప్పటికే ఏబీఏం కాంపౌండ్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ దగ్గరకు వేలాది మంది కార్యకర్తలు, నాయకులు తరలి వచ్చారు. ఆకాశంలో హెలికాప్టర్‌ కనిపించగానే ఈలలు, కేరింతలతో సందడి చేశారు.

కిలోమీటరు దూరానికి అరగంటపైనే..

జగన్‌ను చూడాలన్న అభిమానంతో ఎంతో మంది మహిళలు, చిన్నారులు, యువకులు తరలి వచ్చారు. సమీపంలో ఉన్న చెట్లు, ఏబీఎం కాంపౌండ్‌ గోడ, ఆటోలు, కార్ల మీదకు ఎక్కి జగన్‌ను చూసేందుకు పోటీపడ్డారు. జగన్‌ కనిపించగానే అదిగో జగన్‌ అంటూ మహిళలు ఉత్సాహంగా చేతులూపారు. కొంతమంది చిన్నారులు తమ తండ్రి భుజం మీద ఎక్కి జగన్‌ను చూసి సంబరంగా కేరింతలు కొట్టారు. గం.11.50 కు హెలిప్యాడ్‌ నుంచి జగన్‌ బయలుదేరారు. స్టేషన్‌ రోడ్డులో ఉపాస్‌ హాస్పిటల్‌ మీదుగా జిల్లా జైలు వద్ద చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడ నుంచి ఏబీఎం కాలేజీ రోడ్డు మీదుగా జాయ్‌ హాస్పిటల్‌ సెంటర్‌కు వచ్చి, క్లౌ పేటకు బయలుదేరారు. గం.12.20కు క్లౌపేట మూడో లైనులో ఉన్న కాకుమాను రాజశేఖర్‌ ఇంటికి చేరుకున్నారు. హెలిప్యాడ్‌ నుంచి రాజశేఖర్‌ ఇంటి వద్దకు కిలో మీటర్‌ దూరం ఉండగా అక్కడకు చేరడానికి అరగంట పట్టింది. జగన్‌ పర్యటన ఆద్యంతం ప్రజలు, పార్టీ శ్రేణులతో రహదారులు కిక్కిరిసి పోయాయి. స్టేషన్‌ రోడ్డు, ఏబీఎం కాలేజీ రోడ్డు, క్లౌ పేట రోడ్డులో ఇసుక వేసినా రాలనట్లు జనం పోటెత్తారు.

మా జగనయ్య...మళ్లీ రావాలి...

ఏబీఎం కాంపౌండులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్దకు నగరంలోని రాంనగర్‌ నుంచి కొంతమంది మహిళలు తరలి వచ్చారు. హెలిప్యాడ్‌ చుట్టూ జనం భారీగా గుమిగూడి ఉండడంతో పక్కన నిలబెట్టారు. జగన్‌ హెలికాప్టర్‌ నుంచి బయటకు వచ్చి కాన్వాయ్‌ ఎక్కగానే అదిగో జగన్‌ అంటూ హెలిప్యాడ్‌ వైపు పరుగులు తీశారు. మా అయ్య..మళ్లీ రావాలి... మాకు ఆయన చేసిన సాయం ఎప్పటికీ మరచిపోలేమని సుశీలమ్మ అనే ఒక మహిళ చెప్పారు. దారిపొడవునా మహిళలు, చిన్నారులు డాబాలు ఎక్కి చేతులు ఊపారు. జగన్‌ తిరుగు ప్రయాణంలోనూ చిన్నారులు, మహిళలు జగన్‌ కోసం ఎదురు చూస్తూ నిలబడ్డారు. వారిని పోలీసులు వారించడం కనిపించిది.

నాయకులను పలకరించిన జగన్‌...

ఏబీఎం కాంపౌండ్‌లో హెలిప్యాడ్‌ వద్ద జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వైఎస్సార్‌ సీపీ నాయకులు, పలువురు ప్రజా ప్రతినిధులను వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పలకరించారు. ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి ముందుగానే హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎమ్మెల్సీ తలశిల రఘురాం, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్‌, మాజీ ఎంపీలు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, నందిగం సురేష్‌, మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్‌ సుధాకర బాబు, బుర్రా మధుసూదన్‌ యాదవ్‌, అన్నా రాంబాబు, కేపీ నాగార్జునరెడ్డి, కదిరి బాబూరావు, జంకె వెంకటరెడ్డి, కసుకుర్తి ఆదెన్న, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు దద్దాల నారాయణ యాదవ్‌, డాక్టర్‌ చింతలపూడి అశోక్‌ కుమార్‌, కరణం వెంకటేష్‌, ఒంగోలు పార్లమెంట్‌ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్‌, ఎస్సీ సెల్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కొమ్మూరి కనకరావు, రాష్ట్ర కార్యదర్శులు వై వెంకటేశ్వరరావు, కేవీ రమణా రెడ్డి, ఒంగోలు నగర పార్టీ అధ్యక్షుడు కఠారి శంకర్‌, లంకపోతు అంజిరెడ్డి తదితరులు జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

హెలిప్యాడ్‌ వద్ద వైఎస్‌ జగన్‌ను కలిసిన సురేష్‌, తాటిపర్తి చంద్రశేఖర్‌, వెంకాయమ్మ, మేరుగు నాగార్జున, బత్తుల, చింతలపూడి అశోక్‌కుమార్‌, బుర్రా మధుసూదన్‌, అన్నా రాంబాబు, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, జూపూడి ప్రభాకర్‌, కరణం వెంకటేష్‌, చుండూరి రవిబాబు, దద్దాల నారాయణ , బాబూరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement