ఆటో ఢీకొని యువకుడు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

ఆటో ఢీకొని యువకుడు దుర్మరణం

Sep 30 2026 2:22 AM | Updated on Sep 30 2026 2:22 AM

కొత్తపట్నం: కూలి పనులకు వెళ్తుండగా సోమవారం ఆటో ఢీకొని తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు మంగళవారం పరిస్థితి విషమించి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొత్తపట్నం డీడీ కాలనీకి చెందిన మాకాని శ్రీనివాసరావు (55) కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. సోమవారం ముగ్గురు వ్యక్తులతో కలిసి రోజువారీ కూలి పనులకు వెళ్తున్నాడు. డీడీ కాలనీ నుంచి ఈతముక్కల వెళ్లే రోడ్డులో డి నడుచుకుంటూ వెళ్తుండగా, గుర్తు తెలియని ఆటో కొత్తపట్నం నుంచి ఈతముక్కల వెళ్తూ ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడి స్పృహతప్పి పడిపోయిన శ్రీనివాసరావును ఒంగోలులోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఆయన మృతి చెందాడు. ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తపట్నం ఎస్సై వేముల సుధాకర్‌బాబు తెలిపారు.

పోలేరమ్మ ఆలయంలో హుండీ చోరీ

చీమకుర్తి రూరల్‌: పోలేరమ్మ ఆలయంలో హుండీ చోరీకి గురైన సంఘటన చీమకుర్తి మండలంలోని ఏలూరివారిపాలెం గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆలయం బయట గేటు తాళాన్ని పగలగొట్టి లోపలికి ప్రవేశించి హుండీలోని నగదు అపహరించినట్లు ఆలయ నిర్వాహకుడు మన్నం హరిప్రసాద్‌ తెలిపారు. హుండీలో సుమారు రూ.10 వేల నగదు ఉంటుందని వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

నేడు జీజీహెచ్‌లో మెగా మెడికల్‌ క్యాంప్‌

ఒంగోలు టౌన్‌: సేవా సంకల్ప్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్‌)లో ఈ నెల 30వ తేదీ మెగా మెడికల్‌ క్యాంప్‌ నిర్వహించనున్నట్లు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మాణిక్యరావు తెలిపారు. మంగళవారం జీజీహెచ్‌లోని సూపరింటెండెంట్‌ చాంబర్లో సమావేశం నిర్వహించి మాట్లాడారు. జీజీహెచ్‌లోని క్రిటికల్‌ కేర్‌ ఆవరణలో నిర్వహించే మెగా వైద్య శిబిరంలో అన్ని విభాగాలకు సంబంధించిన వైద్య సేవలు అందజేయనున్నట్లు తెలిపారు. షుగర్‌, రక్త పరీక్షలు, ఎక్సరేలను ఉచితంగా తీసి అవసరమైన వైద్య సలహాలు, సూచనలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఒంగోలు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌, ప్రభాకర్‌, తిరుపతిరెడ్డి, బాలాజీ నాయక్‌, కమలశ్రీ, లక్ష్మానాయక్‌, తేజ, సుజాతరాణి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement