జంక్‌ ఫుడ్‌తో గుండె జబ్బులు..! | - | Sakshi
Sakshi News home page

జంక్‌ ఫుడ్‌తో గుండె జబ్బులు..!

Sep 30 2026 2:22 AM | Updated on Sep 30 2026 2:22 AM

ఒంగోలు టౌన్‌: మారుతున్న జీవనశైలిలో భాగంగా ఆహారపు అలవాట్లలో పెను మార్పులు వచ్చాయని, జంక్‌ ఫుడ్‌ ఎక్కువగా తినడం వల్ల చిన్న వయసులోనే గుండె జబ్బులు వస్తున్నాయని చైతన్య కార్డియాక్‌ సెంటర్‌ అధినేత డాక్టర్‌ బీఎంవీ కృష్ణచైతన్య అన్నారు. మంగళవారం వరల్డ్‌ హార్ట్‌ డేని పురస్కరించుకుని గుండె జబ్బులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఒంగోలులోని అంజయ్య రోడ్డులో ఉన్న చైతన్య కార్డియాక్‌ సెంటర్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు వాకథాన్‌ కార్యక్రమం నిర్వహించారు. సీనియర్‌ వైద్యుడు వీబీఎస్‌ వరప్రసాద్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్శంగా కృష్ణచైతన్య మాట్లాడుతూ పిల్లలకు చిన్నతనం నుంచే మంచి ఆహారపు అలవాట్లు చేయాలని సూచించారు. సానుకూల ఆలోచనలు, ప్రతిరోజూ నడక, వ్యాయమం చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్పారు. వైద్యుల సలహా లేకుండా సొంత వైద్యం చేసుకోకూడదని స్పష్టం చేశారు. వాకథాన్‌లో పాల్గొన్న రోబో నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో చైతన్య కార్డియాక్‌ సెంటర్‌ ల్యాబ్‌ ఇన్‌చార్జి స్వర్ణ రమేష్‌బాబు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

జీజీహెచ్‌ ఆధ్వర్యంలో ర్యాలీ...

మానసిక ఒత్తిడి నుంచి బయటపడటం ద్వారా గుండె జబ్బులు దరికి రాకుండా చూసుకోవచ్చని ఒంగోలు గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌ (జీజీహెచ్‌) సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మాణిక్యరావు సూచించారు. వరల్డ్‌ హార్ట్‌ డేని పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాణిక్యరావు మాట్లాడుతూ గుండె జబ్బులను నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో గుండె జబ్బుల బారిన పడకుండా కాపాడుకోవచ్చని, జబ్బుల బారిన పడిన తర్వాత వైద్యుల సూచనలు, సలహాలు తూ.చ. తప్పకుండా పాటించడం ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చని చెప్పారు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శ్రీవాణి మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని సూచించారు. సమతుల ఆహారం, క్రమంతప్పని వ్యాయమం అలవాటు చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో జీజీహెచ్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ వెంకటేశ్వరరావు, డా.మహేష్‌, డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌కుమార్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మస్తాన్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

చిన్న వయసులోనే హార్ట్‌ అటాక్‌లు

జీవనశైలిలో మార్పులతోనే గుండె భద్రం

వరల్డ్‌ హార్ట్‌ డే సందర్భంగా వాకథాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement