బేస్తవారిపేట:
మండలంలోని మోక్షగుండం ఎస్సీకాలనీకి చెందిన కువ్వారపు కిషన్(36) ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న సమయంలో మృతిచెందాడు. అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని 10 ఇంజినీర్ రెజిమెంట్లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇండియా, చైనా సరిహద్దు సమీపంలో తవాంగ్ వద్ద విధులు నిర్వహిస్తుండగా జరిగిన ప్రమాదంలో మృతిచెందాడు. మృతుడికి భార్య, మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. కిషన్ మృతితో భార్య, తల్లిదండ్రులు బోరున విలపించారు. కిషన్ పార్థివదేహం మంగళవారం స్వగ్రామం మోక్షగుండం రానుంది.


