కనిగిరిలో బడి ఎన్నికలకు బ్రేక్‌ | - | Sakshi
Sakshi News home page

కనిగిరిలో బడి ఎన్నికలకు బ్రేక్‌

Sep 29 2026 2:03 AM | Updated on Sep 29 2026 2:03 AM

కనిగిరిలో బడి ఎన్నికలకు బ్రేక్‌

కనిగిరి: అధికారంలో ఉన్నాం..అనుకున్నది చేస్తాం.. మేం అనుకున్నదే జరగాలి.. అన్న చందాన ఉంది కూటమి సర్కార్‌ తీరు. పొరుగు జిల్లాలో సీఎం పర్యటన అయితే ఈ జిల్లాలోని నియోజకవర్గంలో బడి ఎన్నికలకు బ్రేక్‌ చెప్పారు అధికారులు. ఈమేరకు విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 458 ప్రభుత్వ ప్రాథమిక ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో నేడు జరగాల్సిన ఎస్‌ఎంసీ ఎన్నికలు నిలిచిపోయాయి. దీంతో ఆరు మండలాల్లో సుమారు 24,828 మంది విద్యార్థుల తల్లిదండ్రులు బడి ఎన్నికలకు దూరం కానున్నారు. అయితే ఈ ఎస్‌ఎంసీ ఎన్నికలను కనిగిరి నియోజకవర్గంలో అక్టోబర్‌ 1కి వాయిదా వేసినట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. మార్కాపురం జిల్లాలోని కనిగిరి ఆరు మండలాలు మినహా.. మార్కాపురం, గిద్దలూరు, వై పాలెంలోని 15 మండలాల్లో ఎస్‌ఎంసీ ఎన్నికలు మంగళవారం యధావిధిగా సాగుతాయి.

సీఎం సభకు జనసమీకరణ కోసమే..

ఈనెల 29న మంగళవారం నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో రామాపురంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. సీఎం సభకు జన సమీకరణలో భాగంగా కనిగిరి నియోజకవర్గం నుంచి జనాలను తరలించేందుకు బడి (ఎస్‌ఎంసీ) ఎన్నికలకు బ్రేక్‌ వేసినట్లు సమాచారం. ఈమేరకు అధికార పార్టీ నాయకులు ఇప్పటికే నియోజకవర్గంలో సీఎం సభకు హాజరు కావాలని విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా పామూ రు పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎస్‌ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తే.. విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రధానంగా అధికార పార్టీ సానుభూతిపరులు సీఎం సభకు రారనే ఉద్దేశంతో బడి ఎన్నికలను వాయిదా వేసినట్లు ప్రచారం జరుగుతోంది.

ప్రైవేటు పాఠశాలలు

ఎస్‌ఎంసీ ఎన్నికలకు దూరం..

పాఠశాలల అభివృద్ధితో పాటు వివిధ సంక్షేమ పథకాలను విద్యార్థులకు సక్రమంగా అందజేయడం, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తక్షణ ప్రణాళికలు, చర్యలు చేపట్టేందుకు నిర్వహించే ఎస్‌ఎంసీ కమిటీల ఎన్నికల పట్ల ప్రైవేటు పాఠశాలలు పూర్తి నిరాసక్తత చూపించాయి. ప్రకాశం జిల్లాలో మొత్తం 1,980 పాఠశాలలుండగా, వాటిలో 1,489 ప్రభుత్వ, 443 ప్రైవేటు, 48 ఎయిడెడ్‌ పాఠశాలలున్నాయి. మార్కాపురం జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో మొత్తం 1,620 పాఠశాలలుండగా, 1,330 ప్రభుత్వ, 230 ప్రైవేటు, 60 ఎయిడెడ్‌ పాఠశాలలున్నాయి. ప్రకాశం జిల్లాలో 1,11,936 మంది విద్యార్థులుండగా, మార్కాపురం జిల్లాలో 1,59,828 మంది ఉన్నట్లు సమాచారం. మార్కాపురం జిల్లాలోని 21 మండలాల్లో 1,0096 మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్నికల్లో పాల్గొనాల్సి ఉండగా అందులో 24,828 మంది విద్యార్థుల తల్లిదండ్రులు సీఎం సభ కారణంగా ఎన్నికలకు మంగళవారం దూరం కానున్నారు. వీరు కాకుండా మార్కాపురం జిల్లాలోని 21 మండలాల్లో పూర్తిగా 286 ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు సుమారు 69 వేల మంది అసలు ఎస్‌ఎస్‌ఎంసీ ఎన్నికల్లో పాల్గొనడం లేదు. ఎస్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు గుర్తింపు పొందిన పాఠశాలల నిర్వాహకులు పూర్తిగా నిరాసక్తత చూపారని విద్యాశాఖ అధికారి సోమ సుబ్బారావు వెల్లడించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని గుర్తింపు పాఠశాలల్లో ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది.

సీఎం పర్యటన కోసమే..

జిల్లాలో 286 ప్రభుత్వ గుర్తింపు స్కూళ్లు ఎస్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు నిరాసక్తత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement