ప్రజల పక్షాన నిలబడితే అక్రమ కేసులా..? | - | Sakshi
Sakshi News home page

ప్రజల పక్షాన నిలబడితే అక్రమ కేసులా..?

Sep 29 2026 2:03 AM | Updated on Sep 29 2026 2:03 AM

● మాజీ మంత్రి, వైఎస్సార్‌ పీఎసీ సభ్యుడు డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌

టంగుటూరు: ప్రజల పక్షాన నిలబడితే అక్రమ కేసులు బనాయించడం దారుణమని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యుడు, నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ ధ్వజమెత్తారు. వివరాల్లోకి వెళితే..మర్లపాడు, కొణిజేడు, కందులూరు, సర్వేరెడ్డిపాలెం, యరజర్ల గ్రామాల పరిధిలోని కొండల్లో తవ్వకాలపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి డాక్టర్‌ సురేష్‌ గ్రామస్తులకు మద్దతు పలికి న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి సురేష్‌, పార్టీ మండల అధ్యక్షుడు చింతపల్లి హరిబాబుతో సహా 41 మందిపై అక్రమ కేసులు బనాయించారు. మంగళవారం గ్రామాల ప్రజలతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఆదిమూమలపు సురేష్‌ 41 నోటీసులు తీసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సురేష్‌ మాట్లాడుతూ ఐదు గ్రామ ప్రజలకు ఫ్యాక్టరీ పెట్టడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని మద్దతు పలికితే కేసులు బనాయిస్తారా అని ప్రశ్నించారు. పోలీసులను మరోసారి పరిశీలించుకొని వారిని కేసు నుంచి తొలగించాలని టంగుటూరు ఎస్సె ఫణిభూషణ్‌ని కోరారు. ఐదు గ్రామాల ప్రజల ప్రాణాలను హరించేందుకు, పచ్చని పొలాలను నాశనం చేసేందుకు మైనింగ్‌కు అనుమతి ఇవ్వడం దారుణమన్నారు. ప్రభుత్వం 1300 ఎకరాల్లో మైనింగ్‌ చేయాలని ఇష్టానుసారంగా తవ్వేసుకుంటున్నారన్నారు. అనుమతులు లేకుండా తవ్వకాలు చేస్తే సహించేది లేదని సురేష్‌ హెచ్చరించారు. ప్రభుత్వ ఫ్యాక్టరీని వెనక్క తీసుకోకపోతే జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయిస్తానని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు చింతపల్లి హరిబాబు, కొమ్ము సురేంద్ర, మేదరమిట్ల భరత్‌రెడ్డి, చింతం చైతన్యరెడ్డి, షేక్‌ యాసిన్‌, పేరూరి కమలాకర్‌, ఈదా వెంకటరెడ్డి, బుర్రా అంకరాజు, రాయిండ్ల వెంకట నారాయణ, సింగమనేని బ్రహ్మయ్య, ఈదర అమర్నాథ్‌, గుండపనేని వెంకటరెడ్డి, గుంజి వెంకటేశ్వర్లు, ఉప్పుతోల్ల రవి, దాసరి సునీల్‌, మద్దులూరి అయ్యలరావు, కొల్లి వెంకటేశ్వర్లు, దాసరి వెంకటేశ్వర్లు, మేడికొండ వేణు, కావూరి అబ్బురాం, యాకోబు, కావూరి వీరయ్య, పమ్మి శేషిరెడ్డి, ఈదా సుబ్బారెడ్డి, కొల్లి అంకమ్మ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement