విద్యుదాఘాతానికి హెల్పర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతానికి హెల్పర్‌ మృతి

Sep 29 2026 2:03 AM | Updated on Sep 29 2026 2:03 AM

కంభం: విద్యుదాఘాతానికి గురై హెల్పర్‌ మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం మండలంలోని జంగంగుంట్ల గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే..మండలంలోని జంగంగుంట్ల గ్రామంలో ఆదివారం సాయంత్రం విద్యుత్‌ సమస్య తలెత్తి సరఫరా నిలిచిపోయింది. దీంతో విద్యుత్‌శాఖ అధికారులు, లైన్‌మెన్‌లు లైను మరమ్మతులు చేసేందుకు జంగంగుంట్ల గ్రామం వెళ్లి అక్కడ పనులు మొదలుపెట్టారు. హెల్పర్‌గా పనిచేస్తున్న కంచర్ల రమేష్‌ను ఉదయం లైన్‌మెన్‌ వచ్చి కంభం నుంచి ద్విచక్రవాహనంపై జంగంగుంట్లకు తీసుకెళ్లాడు. పోల్‌ ఎక్కి మరమ్మతులు చేస్తున్న తరుణంలో ఒక్కసారిగా విద్యుత్‌ షాక్‌కు గురైన రమేష్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా రమేష్‌ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. రెండు లైన్లు ఉండగా ఒక లైనుకులెల్‌సి తీసుకున్న సిబ్బంది మరో లైనుకు ఎల్‌సీ తీసుకోకపోవడంతో షాక్‌కు గురై మృతి చెందినట్లు తెలిసింది. సంఘటనపై మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కుటుంబంలో విషాదం:–

మృతి చెందిన రమేష్‌కు భార్య, ఐదుగురు అందులో ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. లైన్‌మెన్ల ల కింద కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే రమేష్‌ ఒక్కసారిగా మృతిచెందడంతో ఆ కుటుంబంలో విషాధ చాయలు అలుముకున్నాయి.

విద్యుత్‌శాఖ నిర్లక్ష్యంతోనే రమేష్‌ మృతి

విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే రమేష్‌ మృతి చెందాడని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి షాలెం రాజు ఆరోపించారు. లక్షల రుపాయలు జీతాలు తీసుకుంటున్న విద్యుత్‌శాఖ ఉద్యోగులు స్థంబాలు ఎక్కి మరమ్మతులు చేయకుండా ప్రవేటుట్‌ క్తులను ప్రమాదకర పనులకు వినియోగించడం సరికాదన్నారు. బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయడంతో పాటు ప్రమాదానికి కారణమైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement