దివ్యాంగుల సంక్షేమ పథకాలు కొనసాగించాలి | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగుల సంక్షేమ పథకాలు కొనసాగించాలి

Sep 29 2026 2:03 AM | Updated on Sep 29 2026 2:03 AM

దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పులిపాటి దుర్గారెడ్డి

ఒంగోలు సిటీ: దివ్యాంగులకు గతంలో అమలైన సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగించాలని వైఎస్సార్‌ సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పులిపాటి దుర్గారెడ్డి డిమాండ్‌ చేశారు. ఒంగోలులో సోమవారం నిర్వహించిన వైఎస్సార్‌ సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా స్థాయి విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. సదరం సర్టిఫికెట్లలో వైకల్య శాతం తగ్గించడం ద్వారా పలువురు దివ్యాంగులు పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారని దుర్గారెడ్డి ఆరోపించారు. ఒక పింఛన్‌ను అర్హతగా చూపించి ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలకు దూరం చేయడం సరికాదన్నారు. గతంలో ఉన్న వైకల్య శాతం నిబంధనలను కొనసాగించి, అర్హులైన దివ్యాంగులందరికీ సంక్షేమ పథకాలు అందించాలని కోరారు. దివ్యాంగుల సమస్యలపై ఆందోళనలు చేపడుతున్న సమయంలో తమపై దాడులు జరిగాయని ఆయన ఆరోపించారు. అంజినప్ప అనే అంధ దివ్యాంగుడికి సంబంధించిన ఉద్యోగ విషయంలోనూ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, దీనిపై ప్రభుత్వం సమగ్రంగా విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు.

ఉద్యోగాలు కల్పించాలి:

రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు సహా వివిధ వర్గాల ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారని దుర్గారెడ్డి విమర్శించారు. రైతులకు సాగునీరు, గిట్టుబాటు ధరలు, ఎరువుల సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి విషయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగుల విభాగం పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తుందని తెలిపారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని దుర్గారెడ్డి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో రైతులు, విద్యార్థులు ఇలా ఏరంగానికి సంబంధించిన వారైనా సంతోషంగా లేరని విమర్శించారు. రూ.6 వేలు పెన్షన్‌ ఇస్తున్నాం అని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఎంతమంది పెన్షన్లు తీసేసిందన్నారు. ఒక పెన్షన్‌ అడ్డుగా పెట్టుకొని చంద్రబాబు ప్రభుత్వం ద్వారా పొందుతున్న సంక్షేమ పథకాలకు అడ్డుకట్టగా పెన్షన్లు తగ్గించారన్నారు. దివ్యాంగుల హక్కులు, సంక్షేమం కోసం తమ పోరాటం కొనసాగుతుందని దుర్గారెడ్డి స్పష్టం చేశారు. సమావేశంలో దివ్యాంగుల విభాగం ప్రకాశం జిల్లా అధ్యక్షుడు దొంతిరెడ్డి గోపాల్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఆవుల నాగేంద్ర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వా బ్రహ్మయ్య, జిల్లా కమిటీ మెంబరు దగ్గుల బ్రహ్మానందరెడ్డి, దివ్యాంగుల విభాగం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement